Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అన్ని భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ తరచూ వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా ఈమె నటుడు విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉన్నారనే వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంది.
ఇప్పటికే వీరిద్దరి రిలేషన్ గురించి పలుమార్లు స్పందించి తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ వీరి గురించి వచ్చే ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.అయితే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేశారంటూ మరొక వార్త వైరల్ అయింది.ఇక నూతన సంవత్సరం రోజున ఈమె లైవ్ సెషన్ లో పాల్గొనగా వెనుక విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించిందని వీరిద్దరూ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక విజయ్ దేవరకొండతో తనకు రిలేషన్ ఉందంటూ వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు. తాజాగా ఈమె మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మనకు కావాల్సిందే వింటున్నాం అనే భావనలో ఉంటారు. ఇక విజయ్ దేవరకొండ తాను రిలేషన్ లో ఉన్నామని అందరూ భావిస్తున్నారు కనుక ఎవరి వాయిస్ విన్న తన వాయిస్ విన్నట్టే ఉంటుందని అయితే నేను మీతో మాట్లాడుతూ ఉండగా నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ ఉన్నారని ఈమె తెలిపారు.
విజయ్, నా గురించి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం గీతగోవిందం సినిమాలో మా క్యారెక్టర్స్ అని ఈమె తెలిపారు.ఇక తాను విజయ్ తో కలిసి వెకేషన్ కి టూర్స్ కి వెళ్ళనని చెప్పలేదు కానీ మేము ఎప్పుడు వెళ్లినా దాదాపు ఏడేనీమిది మంది స్నేహితులతో కలిసే వెళ్తానని ఈ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్ గురించి స్పందించారు. ఇక మా ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా ఫ్యామిలీస్ కాస్త డిస్టర్బ్ అవుతాయని రష్మిక తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…