Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో వరుస షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె మరో అద్భుతమైన రికార్డును కైవసం చేసుకున్నారు.
ప్రతినెల ఐఎండిబి అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేసే విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రతినెల అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీల జాబితాలలో పలువురు సెలబ్రిటీలు చోటు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా ఐఎండిబి జాబితాలో నేషనల్ రష్మిక మందన్న చోటు సంపాదించుకున్నారు.
తాజాగా విడుదల చేసిన జాబితాలో ఈమె మూడో స్థానంలో నిలవడం విశేషం.తాజాగా రష్మిక పుట్టినరోజు సందర్భంగా అలాగే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలలో రష్మిక సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె అత్యంత ప్రజాదరణ పొందారు. ఈ క్రమంలోనే ఐఎండిబి జాబితాలో రష్మిక మందన్న మూడో స్థానంలో నిలిచి పలువురు స్టార్ సెలబ్రిటీలను కూడా వెనక్కి నెట్టారు.
ఇలా ఈ జాబితాలో రష్మిక మూడో స్థానంలో ఉన్నారని తెలియడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా షూటింగ్ తో పాటు రెయిన్ బో అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అలాగే నితిన్ సరసన మరో సినిమా కూడా చేయబోతున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…