కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదల అవుతాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చి నెమ్మదిగా థియేటర్స్ పెరిగి హిట్ సాధిస్తుంటాయి. ఏ సినిమాకైనా పబ్లిసిటీ ఎంత ముఖ్యమో, సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే వాటికి మౌత్ టాక్ ముఖ్యం. వాళ్ళు ఇచ్చే రిపోట్ మాత్రమే సినిమా సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. జనాలు నచ్చని, మెచ్చని సినిమా కాసుల వర్షం కురిపించింది ఏదీ లేదు. కథ, కథనం తయారు చేసుకునేటప్పుడు దర్శక, రచయితలకి అద్భుతంగా అనిపిస్తుంది.
అది విన్న హీరో, హీరోయిన్.. నిర్మాత బ్లాక్ బస్టర్ అని గట్టిగా ఫిక్స్ అవుతారు. మంచి లొకేషన్స్..కథకి సరిపోయే హీరో, హీరోయిన్ వాళ్ళకి తగ్గ బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించే నిర్మాత. సినిమాకి అత్యంత ప్రధానమైన భాగం సంగీతం. కథకి ఎలాంటి సంగీతం కావాలి.. ఎలాంటి నేపథ్య సంగీతం ఉండాలి..దీనికి సరైన సంగీత దర్శకుడు ఎవరు..ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని సినిమాను తీసి..భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించి అంతే భారీ స్థాయిలో రిలీజ్ చేస్తారు. కానీ ఎక్కడో ఏదో పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో మేకర్స్ సినిమా మీద పెట్టుకున్న అంచనాలు, ఆశలు ఆవిరైపోతారు. ఒకవేళ ఇది డెబ్యూ డైరెక్టర్ మూవీ అయితే మళ్ళీ ఆ డైరెక్టర్‌కి సినిమా రావడం గగనమే.
అలాంటి పరిణామాలే ఓయ్ సినిమా విషయంలో కూడా జరిగాయి. బొమ్మరిల్లు తర్వాత సౌత్ మొత్తంలో స్టార్ హీరోగా సిద్దార్థ్‌కి అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చింది. ఆయన హీరోగా, షామిలీ హీరోయిన్‌గా పరిచయం అవుతుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం. డెబ్యూ డైరెక్టర్ ఆనంద్ రంగా కథ కథనం. ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య యూనివర్సల్ మీడియా సంస్థలో నిర్మాణం. సినిమాలో సిద్దార్థ్ క్లాసీ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది.
ఓయ్ సినిమా రిలీజ్‌కి ముందే ఆడియో పెద్ద హిట్. సినిమా రిలీజయ్యాక కూడా ప్రతీ సాంగ్ చాలా ఆకట్టుకుంది. సాంగ్స్ పరంగా మూవీ భారీ హిట్ అని టాక్ తెచ్చుకుంది. కథ కథనం అంతా పర్‌ఫెక్ట్ గా కుదిరింది. ఓ సాంగ్ సిద్దార్థ్ పాడాడు. ఓ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సిద్దార్థ్ పాడాడు. మిగతా పాటలను శ్రేయ ఘోషాల్, సునిధి చౌహాన్, శ్వేతా పండిట్, కె కె, ప్రియ హిమేష్ లాంటి పాపులర్ సింగర్స్ పాడారు. కానీ సినిమాలో ఏదో మిస్సింగ్. అదే హీరోయిన్ శామిలీ పర్ఫార్మెన్స్. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న ఈమె హీరోయిన్ ఎంట్రీ అంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు.
కానీ వారి ఊహలన్నీ తారుమారయ్యాయి. కథ నేపథ్యం ప్రకారం హీరోయిన్ క్లైమాక్స్ లో చాలా డీ గ్లామర్ గా హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవాలి. కానీ శామిలీ ఈ విషయంలో మైనస్ అయింది. క్లైమాక్స్ చూసిన ఎవరికైనా నాగార్జున నటించిన గీతాంజలి సినిమా గుర్తొస్తుంది. దాదాపు చాలామంది ఆ సినిమా క్లైమాక్స్ తో కంపేర్ చేసుకున్నారు. దాంతో ఇది మరో పెద్ద మైనస్ అయింది. ఇక దర్శకుడు క్లైమాక్స్ తీయడంలో తడబడ్డాడు. సరైన ముగింపు లేకపోవడం హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోకపోవడంతో భారీ అంచనలా మధ్య వచ్చిన ఓయ్ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…