ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఈ విధంగా కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల పట్లఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో వందలాది మంది పిల్లలు తమ కుటుంబ పెద్ద దిక్కులు కోల్పోవటంతో వారి జీవనాధారం కోసం రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి దుర్భర పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు వారి పేరిట ఏకంగా పది లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది.
ఈ విధంగా చిన్నారుల పేరిట డిపాజిట్ చేసిన పది లక్షల రూపాయలకు నెలనెలా వచ్చే వడ్డీ ఆ పిల్లలకు కనీస అవసరాలను తీర్చేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆ పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తర్వాత వారి పేరిట డిపాజిట్ చేసిన పది లక్షల రూపాయలు డ్రా చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించనుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…