రెజీనా కాసాండ్రా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే.. ఎప్పుడో సుధీర్ బాబు సరసన “శివ మనసులో శృతి” అనే సినిమా ద్వారా తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ భామ ఆతరువాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెప్పుకోవడానికి భారీ హిట్లు లేకపోయినా తరువాత యుంగ్ హీరో సందీప్ కిషన్ సరసన వచ్చిన “రొటీన్ లవ్ స్టోరీ” సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆతరువాత వచ్చిన “పిల్లా నువ్వులేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సెల్” సినిమాలలో సాయి ధరమ్ తేజ్ సరసన కథానాయికగా తళుక్కున మెరిసింది.
ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే అడపా దడపా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. తాజగా విడుదలై విజయం సాధించిన “ఎవరు” సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో ఒక పాటలో నర్తిస్తోంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఈ ఐటెం సాంగ్ హైలైట్ అట. ఇందులో రెజీనా డాన్స్ ఇరగదీసిందాని టాక్. అయితే ఇలాంటి ఐటెం సాంగ్స్ లో మునుపెన్నడూ రెజీనా నటించలేదు, ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా రెజీనా మీడియాతో మాట్లాడుతూ తనకు డాన్స్ అంటే చాలా ఇస్తామని… చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోలేకే ఈ సాంగ్ లో చేయడానికి ఒప్పుకున్నానని, అది చిరంజీవి గారు అడిగారు కాబట్టే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ పాట షూటింగ్ ఆరు రోజులపాటు చిత్రీకరించట. ఈ పాటలో చిరంజీవి గారు తన డాన్స్ చూసి మెచ్చుకున్నారని.. అయన నుంచి అభినందనలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపింది రెజీనా. అయితే దేనిని ఐటెం సాంగ్ అనవద్దని… దీన్ని సెలెబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది ఈ భామ. ఇక ఇలాంటి సాంగ్స్ చేయడం ఇదే చివరి సారి అని.. మరోసారి ఇలాంటి సాంగ్స్ చేయనని తెలిపింది రెజీనా..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…