సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు తెరపైకి ఎక్కించి అద్భుత విజయాలను అందుకున్నవారు కొందరు దర్శకులైతే… అపజయాలను మూటకట్టుకున్న వారు మరికొందరు దర్శకులు. అయితే తాజాగా మరో వాస్తవిక సంఘటన ఆధారంగా సినిమా రాబోతుంది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ ల ప్రేమ కదా ఆధారంగా ఒక సినిమా వస్తుంది. ఈ చిత్రాన్ని నర్రా నాగేశ్వరరావు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి “అన్నపూర్ణమ్మ గారి మనవడు” అనే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ చిత్రానికి యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మాణ భాద్యతలు స్వీకరించగా.. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
సీనియర్ నటి జామున, బాలాదిత్య, అర్చన మరో కీలక పాత్రాలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటుడు బాలాదిత్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ సినిమా కథను సంచలనం రేపిన ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా రాసుకున్నాడని చెప్పారు. అయితే వాస్తవిక ఘటనలను చూపిస్తూనే సినిమా టచ్ ఇచ్చినట్టు తెలిపారు బాలాదిత్య. ఇందులో అర్చన తనకు జంటగా నటిస్తుందని, తక్కువ నివిడి ఉన్న పాత్ర అయినా ఆమె పాత్ర చాలా మంచి గుర్తింపు వచ్చేలా ఉంటుందన్నారు బాలాదిత్య. అయితే ప్రణయ్ చనిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఈ ఘటనపై ఎటువంటి సినిమా రాలేదు. తెలుగు తెరపై ఇప్పటికే ఇలాంటి కధలు చాలానే వచ్చాయి. మరి ఈ కథను ఎంత మంది ఆదరిస్తారో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…