Featured

Regina & Nivedha : ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచేత్తిన ముద్దు గుమ్మలు… అంతా దానికోసమే అంటూ కామెంట్స్..!

Regina & Nivedha : ఈ మధ్య ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో కానీ అటు మెయిన్ మీడియాలో కానీ ప్రస్తావన ఎక్కువైంది. మొన్నా మధ్య ఎన్టీఆర్ ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మీట్ అయి ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో తన నటనకు ప్రశంసించారు. ఇక ఆ తరువాత రచ్చ వేరే విషయం అయినా ఇక బ్రాహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ముఖ్య అతిదిగా ఎన్టీఆర్ సందడి చేసారు. ఇక కరణ్ జోహార్ వంటి బడా నిర్మాతలు మనోడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇప్పుడు ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఎన్టీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.

ఎన్టీఆర్.. కమల్ ఇద్దరూ ఒకటే…

రెజినా కసంద్ర, నీవేదా థామస్ ఇప్పుడు సినిమాల్లో గ్యాప్ ఇచ్చారు కానీ ఇంతకుముందు మంచి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘శాకిని డాకిని’ అనే సినిమాలో కీలక పాత్రల్లో కలిసి నటించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జోరుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మలు ఎన్టీఆర్ ను పోగడ్తలతో ముంచెత్తారు. రెజినా మాట్లాడుతూ ఎన్టీఆర్ నటన కమల్ హాసన్ నటనకు దగ్గరి పోలికలు ఉన్నాయి. తారక్ చాలా మంచోడు, ఈ సినిమాను మంచి మనసుతో అభినందించారు అది చాలా అరుదుగా జరుగుతుంది, ఆయన పుట్టుకతోనే మంచి మనసుతో పుట్టారు అంటూ పొగిడింది. ఇక కమల్ హాసన్ కి ఎన్టీఆర్ కు చాలా విషయాల్లో ఒకేలా ఉంటారని చెప్పింది. రెజినా, ఎన్టీఆర్ తో కలిసి నటించలేదు అయినా ఇంతలా ఎందుకు పొగుడుతోంది అంటూ అనుమానాలు వస్తున్నాయి. ఇక నీవేదా థామస్ ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ సినిమాలో నటించింది. ఇక ఈ అమ్మడు ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసింది.

తార‌క్ ఎన‌ర్జీ అద్భుతం అంటూ పొగిడింది… ఎప్పుడు చూసినా కూడా అస్స‌లు అల‌సిపోడేమో, అత‌డిని చూసిన‌ప్పుడ‌ల్లా నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంద‌ని కూడా నివేద పొగిడింది. ఎన్టీఆర్ ప్ర‌తి ఒక్క‌రినీ దృష్టిలో పెట్టుకుని త‌న‌కు చేత‌నైనంత సాయం చేసేందుకు ముందు ఉంటాడు, క‌మ‌ల్ స‌ర్‌లా ఎన్టీఆర్ కూడా చాలా సరదగా ఉంటాడంటూ పొగిడింది. ఇలా ఈ ముద్దుగుమ్మలు పొగడటంతో తారక్ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. అయితే పనిగట్టుకుని ఎన్టీఆర్ ను పొగడటం వెనుక కేవలం సినిమా ప్రమోషన్ కోసమేనా లేకపోతే నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాల కోసమా అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago