Regina & Nivedha : ఈ మధ్య ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో కానీ అటు మెయిన్ మీడియాలో కానీ ప్రస్తావన ఎక్కువైంది. మొన్నా మధ్య ఎన్టీఆర్ ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మీట్ అయి ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో తన నటనకు ప్రశంసించారు. ఇక ఆ తరువాత రచ్చ వేరే విషయం అయినా ఇక బ్రాహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ముఖ్య అతిదిగా ఎన్టీఆర్ సందడి చేసారు. ఇక కరణ్ జోహార్ వంటి బడా నిర్మాతలు మనోడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇప్పుడు ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఎన్టీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.

ఎన్టీఆర్.. కమల్ ఇద్దరూ ఒకటే…
రెజినా కసంద్ర, నీవేదా థామస్ ఇప్పుడు సినిమాల్లో గ్యాప్ ఇచ్చారు కానీ ఇంతకుముందు మంచి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘శాకిని డాకిని’ అనే సినిమాలో కీలక పాత్రల్లో కలిసి నటించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జోరుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మలు ఎన్టీఆర్ ను పోగడ్తలతో ముంచెత్తారు. రెజినా మాట్లాడుతూ ఎన్టీఆర్ నటన కమల్ హాసన్ నటనకు దగ్గరి పోలికలు ఉన్నాయి. తారక్ చాలా మంచోడు, ఈ సినిమాను మంచి మనసుతో అభినందించారు అది చాలా అరుదుగా జరుగుతుంది, ఆయన పుట్టుకతోనే మంచి మనసుతో పుట్టారు అంటూ పొగిడింది. ఇక కమల్ హాసన్ కి ఎన్టీఆర్ కు చాలా విషయాల్లో ఒకేలా ఉంటారని చెప్పింది. రెజినా, ఎన్టీఆర్ తో కలిసి నటించలేదు అయినా ఇంతలా ఎందుకు పొగుడుతోంది అంటూ అనుమానాలు వస్తున్నాయి. ఇక నీవేదా థామస్ ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ సినిమాలో నటించింది. ఇక ఈ అమ్మడు ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసింది.

తారక్ ఎనర్జీ అద్భుతం అంటూ పొగిడింది… ఎప్పుడు చూసినా కూడా అస్సలు అలసిపోడేమో, అతడిని చూసినప్పుడల్లా నాకు చాలా ఉల్లాసంగా ఉంటుందని కూడా నివేద పొగిడింది. ఎన్టీఆర్ ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తనకు చేతనైనంత సాయం చేసేందుకు ముందు ఉంటాడు, కమల్ సర్‌లా ఎన్టీఆర్ కూడా చాలా సరదగా ఉంటాడంటూ పొగిడింది. ఇలా ఈ ముద్దుగుమ్మలు పొగడటంతో తారక్ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. అయితే పనిగట్టుకుని ఎన్టీఆర్ ను పొగడటం వెనుక కేవలం సినిమా ప్రమోషన్ కోసమేనా లేకపోతే నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాల కోసమా అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.































