Rekha Nair : సినిమా జీవితం అంటేనే అన్ని విషయాలు బయటికి వచ్చేస్తాయి. అవి ప్రేమ వ్యవహారాలైనా లేక గొడవలైనా ఏవైనా సరే. ఇక ఒక ఆర్టిస్ట్ పై మరో ఆర్టిస్ట్ కు బేధాభిప్రాయాలు, మాటకు మాట అనుకోవడాలు కామన్. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరికీ ఏమనిపించినా ఆ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇలాంటివి ఇతరులకు ఇబ్బంది కలిగినపుడు అవి వివాదాలకు దారి తీస్తాయి.
చెప్పుతో కొడతా అంటూ తమిళ నటి వీరంగం…
తమిళ ఇండస్ట్రీ లో సీరియల్స్ ద్వారా సుపరిచితురాలైన రేఖ నాయర్ వంశం, భైరవి, బాల గణపతి, నమ్ ఇరువర్ వంటి పలు సీరియల్స్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. వీడియో జాకీ గా మొదలైన ఆమె కెరీర్ సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సీరియల్స్ వల్ల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పార్తిభన్ దర్శకత్వంలో ఆయన స్వయంగా నటించిన చిత్రం ఇరవీన్ నిగల్. ఈ సినిమా థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కింది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈసినిమాలో రేఖ నాయర్ కూడా నటించారు. ఇక్కడే వివాదం మొదలయింది.
ఆ సినిమాలో తనతో నటించిన సహ నారి చిత్రతో తన సంబంధం గురించి మరో నటుడు రంగనాథ్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రేఖ చెన్నై బీచ్ లో వాకింగ్ వెళ్తుంటే బైలావాన్ రంగనాధ్ ఎదురుపడటంతో కోపంతో వీడియో గురించి అడిగింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతారా..? మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా.? విషయం తెలియకుండా మాట్లాడకూడదు, నేను ఎలాంటి పాత్రాల్లో అయినా సినిమాల్లో నటిస్తా అందుకని ఎలా పడితే అలా కామెంట్ చేస్తావా.? ఇలాగైతే మీ వయసుకు కూడా మర్యాద ఇవ్వను.. చెప్పు తెగుతుంది అంటూ ఫైర్ అయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…