Movie News

Deeksha Seth: వేదం హీరోయిన్ దీక్షా సేత్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… వైరల్ అవుతున్న ఫోటో?

Deeksha Seth: దీక్షా సేత్ ఈ పేరు చెబితే టక్కున ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ నిప్పు మిరపకాయ్ వేదం వంటి సినిమాల హీరోయిన్ అంటే గుర్తుపడతారు. ఈమె వేదం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన ఏ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.

దీక్ష సెత్ కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ఈమె ఓ మోడలింగ్‌ అసైన్‌మెంట్‌ కోసం హైదరాబాదులో పనిచేస్తున్న సమయంలో డైరెక్టర్ క్రిష్ కంటపడింది. వెంటనే ఈయన వేదం సినిమా ద్వారా ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈనటి అనంతరం మిరపకాయ్, నిప్పు, వాంటెడ్, రెబల్ వంటి సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాలు తనకు గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

బీచ్ లో సందడి చేసిన నటి…

దాదాపు పది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరమైన దీక్షా సేథ్ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేశారు. ఈమె టూ పీస్ డ్రెస్ లోబీచ్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. దీక్ష సెత్ ఏంటి ఇలా మారిపోయారు అంటూ పెద్ద ఎత్తున ఈమె ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె పోస్ట్ చూసిన సందీప్‌ కిషన్‌ ‘సేత్‌ మళ్లీ వచ్చేసిందోచ్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. కొందరు మాత్రం ఈమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago