Deeksha Seth: దీక్షా సేత్ ఈ పేరు చెబితే టక్కున ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ నిప్పు మిరపకాయ్ వేదం వంటి సినిమాల హీరోయిన్ అంటే గుర్తుపడతారు. ఈమె వేదం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన ఏ సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.

దీక్ష సెత్ కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ఈమె ఓ మోడలింగ్ అసైన్‌మెంట్ కోసం హైదరాబాదులో పనిచేస్తున్న సమయంలో డైరెక్టర్ క్రిష్ కంటపడింది. వెంటనే ఈయన వేదం సినిమా ద్వారా ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈనటి అనంతరం మిరపకాయ్, నిప్పు, వాంటెడ్, రెబల్ వంటి సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాలు తనకు గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
బీచ్ లో సందడి చేసిన నటి…
దాదాపు పది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరమైన దీక్షా సేథ్ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేశారు. ఈమె టూ పీస్ డ్రెస్ లోబీచ్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. దీక్ష సెత్ ఏంటి ఇలా మారిపోయారు అంటూ పెద్ద ఎత్తున ఈమె ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె పోస్ట్ చూసిన సందీప్ కిషన్ ‘సేత్ మళ్లీ వచ్చేసిందోచ్’ అంటూ కామెంట్ చేశాడు. కొందరు మాత్రం ఈమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram


































