‘చిన్నారి స్నేహమా.. చిరునామా తీసుకో’ అంటూ అప్పట్లో హీరోయిన్ సీతతో కలసి వెండితెరపై సందడి చేసిన సీనియర్ హీరో రఘు గుర్తున్నాడా.? రఘు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే…1994 -1996 లో రఘు అని మనకు ఓ హీరో ఉండేవాడు… ఒకప్పడు మళయాళంలో తనో క్రేజీ స్టార్… తమిళం, తెలుగుల్లో కూడా చిన్నారి స్నేహం, భారత్ బంద్, రాసలీల, సమరం, రేపటి రౌడీ, ఆలయం వంటి ఎన్నో చిత్రాలలో నటించాడు. రఘు పేరుతో హీరోగా నటించడానికి వయసై పోయినా నేటికీ ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంటాడు.
మలయాళ చిత్రరంగంలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రఘు ఆ తర్వాత తమిళం కోలీవుడ్ లో కూడా తన సత్తాను చాటుకున్నాడు. వయస్సు పైబడిన ఈ సీనియర్ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ.. ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో హీరో రామ్ చరణ్‌కు తండ్రిగా నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లోనూ రఘు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. హీరో రఘు అసలు పేరు వర్మిన్ రెహ్మన్. ఇతను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మన్ కి అన్నయ్య అవుతాడన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. వీళ్ళిద్దరూ తోడల్లుళ్లు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వీళ్ళిద్దరి భార్యలు స్వయానా అక్కా చెల్లెళ్ళు.
హీరో రఘుకి ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ళలో రషితా రెహ్మన్ అనే అమ్మాయి ఆల్ రెడీ మళయాళ సినిమా రంగంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. ఈవిధంగా మళయాళం, తెలుగు, తమిళ సినిమా రంగాలలో రఘు ఫ్యామిలీ రాణిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇదిలా ఉంటే, ‘లూసిఫర్’ చిత్రం మలయాళ వెర్షన్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ విలన్ పాత్రను తెలుగులో మన సీనియర్ హీరో రఘు పోషిస్తున్నట్టుగా, ఈ సందర్భంగా రఘును ‘లూసిఫర్’ తెలుగు చిత్ర నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సుజీత్ ఇప్పటికే సంప్రదించారని.. ఈ పాత్ర చేయడానికి రఘు కూడా ఆసక్తి చూపించారని తాజా సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…