వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వచ్చిన ఉప్పెన రిలీజ్ అయ్యి మంచి టాక్ ని తెచ్చుకుంది.మొదటి నుంచి సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలను అయితే సినిమా అందుకుంది. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడు గా మంచి సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. సినిమా ను చాలాబాగా డైరెక్ట్ చేశాడని పొగుడుతున్నారు. ఈ సినిమా తో కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆమెకు ఇప్పుడు ఓ అరడజను సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఉప్పెన ఇంత పెద్ద హిట్ అవడానికి కృతి శెట్టి నే ప్రధాన కారణమని అంటున్నారు. ఈ సినిమా తో అందరి హృదయాలను కట్టిపడేసింది కృతి.. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో కృతి శెట్టి తన రెండో సినిమాకు ఏకంగా 75లక్షలను డిమాండ్ చేస్తోందని టాక్. అయితే పేరు బలమో ఏమోగానీ అనుష్క శెట్టి లాగే ఇప్పుడు కృతి శెట్టి మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్ ఇలా పలువురి సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తోందట.
దీంతో నెటిజన్స్ , సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరు కదా. అందుకే అనుష్క శెట్టికి, కృతి శెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కొందరు నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మహా అయితే ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావచ్చు. అందుకే గూగుల్ లో ఇద్దరి సంబంధం సెర్చ్ చేస్తుంటే, నో ఇన్ఫర్మేషన్ అనే వస్తోందట.టాలీవుడ్ కి ఎక్కువగా ముంబై భామలు , ఇతర భాషా హీరోయిన్స్ వస్తుంటారు. ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారీగా చెలామణి అయిపోతారు. అందులో అనుష్క శెట్టి ఒకరు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…