Categories: FeaturedMovie News

బాడీగార్డ్ చేసిన పనికి ఆ అభిమానికి బంపర్ ఆఫర్ ఇచ్చిన జాన్వీ..?

శ్రీదేవి, బోణీ కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ కపూర్ ధఢక్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.. ఆమె నటించిన గుంజన్ సక్సేనా సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కడంతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయారు. నెట్ ఫ్లిక్స్ లో లాక్ డౌన్ టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఈ సినిమా లో జాన్వీ నటనకు మంచి కితాబొచ్చింది. తొలి సినిమాలోని ఒకటో రెండో లోపాలు ఈ సినిమా తో తుడిచిపెట్టుకుపోయాయి..

ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచిన జాన్వీ దోస్తానా 2 సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉండగా దోస్తానా కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండడం విశేషం.. ఈ సినిమా తో పాటే గుడ్ లక్ జెర్రీ అనే సినిమా ని కూడా చేస్తుంది జాన్వీ.. ఇవే కాకుండా టాలీవుడ్ లో ఎంట్రీ కోసం ఆమెను సంప్రదింపులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటుంటారు.. ఇక జాన్వీ తన అభిమానికి జరిగిన అవమానం చూసి బాధపడింది.

ఇటీవ‌ల జాన్వీ ముంబ‌యి ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్క‌డున్న వారు ఎగ‌బ‌డ్డారు. వారంద‌రికీ ఓపిక‌తో సెల్ఫీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతోంది జాన్వీ. అయితే ఆమె ముందుకు వెళ్లే స‌మ‌యంలో ఒక అభిమాని సెల్ఫీ కోసం ఆమె ద‌గ్గ‌ర‌కు రాగా.. జాన్వీ బాడీగార్డ్ అత‌డిపై కాస్త క‌ఠువుగా ప్ర‌వ‌ర్తించాడు. చేయిని బ‌ల‌వంతంగా తీసేశాడు. అది గ‌మ‌నించిన జాన్వీ.. వెంట‌నే అల‌ర్ట్ అయ్యింది. బాడీగార్డ్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.అభిమాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడుతూ.. సెల్ఫీ తీసుకోమ‌ని చెప్పింది. దీంతో ఆ అభిమాని సంతోషంగా సెల్ఫీ తీసుకున్నాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తోన్న ప‌లువురు నెటిజ‌న్లు జాన్వీ తీరుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

TD Admin

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago