శ్రీదేవి, బోణీ కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ కపూర్ ధఢక్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.. ఆమె నటించిన గుంజన్ సక్సేనా సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కడంతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయారు. నెట్ ఫ్లిక్స్ లో లాక్ డౌన్ టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఈ సినిమా లో జాన్వీ నటనకు మంచి కితాబొచ్చింది. తొలి సినిమాలోని ఒకటో రెండో లోపాలు ఈ సినిమా తో తుడిచిపెట్టుకుపోయాయి..

ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచిన జాన్వీ దోస్తానా 2 సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉండగా దోస్తానా కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండడం విశేషం.. ఈ సినిమా తో పాటే గుడ్ లక్ జెర్రీ అనే సినిమా ని కూడా చేస్తుంది జాన్వీ.. ఇవే కాకుండా టాలీవుడ్ లో ఎంట్రీ కోసం ఆమెను సంప్రదింపులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటుంటారు.. ఇక జాన్వీ తన అభిమానికి జరిగిన అవమానం చూసి బాధపడింది.
ఇటీవల జాన్వీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగెట్టారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. వారందరికీ ఓపికతో సెల్ఫీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతోంది జాన్వీ. అయితే ఆమె ముందుకు వెళ్లే సమయంలో ఒక అభిమాని సెల్ఫీ కోసం ఆమె దగ్గరకు రాగా.. జాన్వీ బాడీగార్డ్ అతడిపై కాస్త కఠువుగా ప్రవర్తించాడు. చేయిని బలవంతంగా తీసేశాడు. అది గమనించిన జాన్వీ.. వెంటనే అలర్ట్ అయ్యింది. బాడీగార్డ్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.అభిమాని దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ.. సెల్ఫీ తీసుకోమని చెప్పింది. దీంతో ఆ అభిమాని సంతోషంగా సెల్ఫీ తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తోన్న పలువురు నెటిజన్లు జాన్వీ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



























