ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో తీయని జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఆ జ్ఞాపకాలను అప్పుడప్పుడు నెమరువేసుకుంటూ ఎంతో సంబరపడిపోతూ ఉంటాము.ఈ ఇలాంటి సన్నివేశాలు సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి తీపి జ్ఞాపకాన్ని నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమకు బీజం పడింది కూడా ఈ సినిమానే ద్వారానే అని చెప్పవచ్చు. ఎంతో విజయం సాధించిన ఈ సినిమా ఏప్రిల్ 20, 2000 సంవత్సరంలో విడుదలయింది.సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నటి రేణు దేశాయ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.
బద్రి సినిమాలో యే చికీతా పాట అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే ఈ పాటకు సంబంధించిన ఓ స్టిల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ”చికీతా షూటింగ్ చేస్తుండగా తీసిన పిక్ ఇది. ఇందులో నా దుప్పటా నాకు సన్ స్క్రీన్ నుంచి రక్షణ కల్పించగా.. పవన్ తో బాంబింగ్ ఫొటో” అంటూ తన ఇన్స్టాలో కామెంట్ పెట్టింది.
రేణు దేశాయ్ షేర్ చేసి ఈ ఫోటో చూసిన నెటిజన్లు మరోసారి పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ జోడి ఫోటో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…