Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా నేను దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈమె పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇక ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత మనస్పర్ధలు కారణంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు కూడా విడిపోయారు. ఇలా పవన్ నుంచి దూరంగా ఉన్నటువంటి ఈమె పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూ వారిని చూసుకుంటూ ఉన్నారు.
ఇక భర్త నుంచి దూరంగా ఉన్న రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఫోటోలను కూడా ఈమె షేర్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఈమె తరుచు తన రెండో పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు.
తాజాగా మరోసారి రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను రెండో పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేస్తుంటారు అయితే తాను మాత్రం మరొక రెండు మూడు సంవత్సరాలలో రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని ఈమె తెలిపారు.
ఇన్ని రోజులు తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను కూడా ఈమె వెల్లడించారు. ఇన్ని రోజులు నా పిల్లలు ఇద్దరు చాలా చిన్నవారు వారికి కేర్ టేకర్ చాలా అవసరం నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే భర్తకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలనీ ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచనతోనే తాను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను..
రెండేళ్లలో పెళ్లి..
ఇక ఇప్పుడు వారు పెద్దవారు అయ్యారు వారి కంటే ఫ్రెండ్స్ లవర్స్ అంటూ మరో లోకం ఉంటుంది వారికి పేరెంట్స్ అనేది కేవలం సపోర్ట్ గా ఉండాల్సి ఉంటుంది అందుకే మరో రెండు మూడు సంవత్సరాలలో తాను పెళ్లి చేసుకుంటే నేను కూడా నా మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేయగలుగుతాను. ఇక నా పిల్లలు కూడా నా పెళ్ళికి పూర్తిగా పాజిటివ్ గానే ఉన్నారు. ఎవరైతే నిన్ను కేరింగ్ చేస్తారో వారినే పెళ్లి చేసుకో అంటూ నాకు సలహాలు ఇస్తూ ఉంటారని రేణు దేశాయ్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…