Connect with us

Featured

Renu Desai: ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా.. మరోసారి రెండో పెళ్లిపై రేణు దేశాయ్ కామెంట్!

Published

on

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా నేను దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈమె పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇక ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత మనస్పర్ధలు కారణంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు కూడా విడిపోయారు. ఇలా పవన్ నుంచి దూరంగా ఉన్నటువంటి ఈమె పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూ వారిని చూసుకుంటూ ఉన్నారు.

ఇక భర్త నుంచి దూరంగా ఉన్న రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఫోటోలను కూడా ఈమె షేర్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఈమె తరుచు తన రెండో పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను రెండో పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేస్తుంటారు అయితే తాను మాత్రం మరొక రెండు మూడు సంవత్సరాలలో రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని ఈమె తెలిపారు.

Advertisement

ఇన్ని రోజులు తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను కూడా ఈమె వెల్లడించారు. ఇన్ని రోజులు నా పిల్లలు ఇద్దరు చాలా చిన్నవారు వారికి కేర్ టేకర్ చాలా అవసరం నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే భర్తకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలనీ ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచనతోనే తాను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను..
రెండేళ్లలో పెళ్లి..

ఇక ఇప్పుడు వారు పెద్దవారు అయ్యారు వారి కంటే ఫ్రెండ్స్ లవర్స్ అంటూ మరో లోకం ఉంటుంది వారికి పేరెంట్స్ అనేది కేవలం సపోర్ట్ గా ఉండాల్సి ఉంటుంది అందుకే మరో రెండు మూడు సంవత్సరాలలో తాను పెళ్లి చేసుకుంటే నేను కూడా నా మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేయగలుగుతాను. ఇక నా పిల్లలు కూడా నా పెళ్ళికి పూర్తిగా పాజిటివ్ గానే ఉన్నారు. ఎవరైతే నిన్ను కేరింగ్ చేస్తారో వారినే పెళ్లి చేసుకో అంటూ నాకు సలహాలు ఇస్తూ ఉంటారని రేణు దేశాయ్ తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Mahesh babu: తన డిజాస్టర్ సినిమాపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ ..గర్వంగా ఉందంటూ?

Published

on

Mahesh babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మరో సినిమాకి కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో తన బావ సుదీర్ బాబు నటించిన హరోం హరా సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈయనతో కలిసి ఫోన్ లో చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హరోం హరలో సుధీర్ బాబు ఎక్కువగా గన్స్ ఉపయోగించారు ఈ క్రమంలోనే సుదీర్ బాబు మహేష్ బాబుని ప్రశ్నిస్తూ..

మీరు నిజం సినిమాలో కూడా ఎక్కువగా గన్నులు ఉపయోగించారు కదా ఈ సినిమా విశేషాలు ఏవైనా గుర్తున్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ.. నిజానికి నిజం సినిమా నాకు చాలా బాగా నచ్చిన సినిమా అని తెలిపారు. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి.

Advertisement

‘నిజం’ చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను అని చెప్పి షాక్ ఇచ్చారు. నిజం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి డిజాస్టర్ సినిమా చేయడం మహేష్ అదృష్టం అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి సినిమాలో మహేష్ నటించబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Chandra Babu: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా ఎన్టీఆర్.. బన్నీ.. అదే కారణమా?

Published

on

Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. కేవలం మెగా కుటుంబం మాత్రమే ఈ వేడుకలలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిసింది.

ఈ విధంగా అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ హీరోలు ఇద్దరు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ కి మాత్రం ఈ కార్యక్రమానికి హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని ఆహ్వానించిన వీరిద్దరూ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే మెగా కుటుంబంతో అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. కేవలం తన స్నేహితుడికి మద్దతు తెలపడంతో మెగా ఫ్యామిలీ తనని దూరం పెట్టారని తెలుస్తుంది. ఇలా అల్లు అర్జున్ ని దూరం పెట్టినప్పటికీ చంద్రబాబు నాయుడు ఈయనని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అల్లు అర్జున్ మాత్రం దూరంగా ఉన్నారు. అందుకు కారణం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఈయన బిజీగా ఉండటమే అని చెప్పాలి.

Advertisement

షూటింగ్ పనులలో బిజీ బిజీ..
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమా కోసం గోవా వెళ్లారు దీంతో ఈయన కూడా అక్కడ షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే రాలేకపోయారని తెలుస్తుంది. ఇటీవల రామోజీరావు మరణించినప్పుడు కూడా వీరు హాజరు కాకపోవటం గమనార్హం.

Advertisement
Continue Reading

Featured

Sudheer Babu: నా సినిమా ఫంక్షన్లకు మహేష్ అందుకే రారు.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!

Published

on

Sudheer Babu: మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈయన తన బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా విభిన్న కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సుధీర్ బాబు ఇప్పటికే పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.

ఇలా నటుడిగా వరుస విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుధీర్ బాబు త్వరలోనే హరోం హర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాపై సుధీర్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. మహేష్ బాబు ఈయన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు లేదంటే వేడుకలకు కూడా హాజరుకారు. అలా తన సినిమాలకు మహేష్ బాబు ఎందుకు రాడు అనే విషయాల గురించి మాట్లాడారు.

Advertisement

ఆయన పేరు వాడాలనుకోలేదు..
మహేష్ బాబు నేను హీరోగా వచ్చిన మొదట్లో ఒక నాలుగైదు సినిమాల వేడుకలకి వచ్చారు..ఒక స్థాయికి వచ్చేవరకు మాత్రమే నేను మహేశ్ సాయం తీసుకున్నాను. ఆ తరువాత కూడా ఆయన పేరును వాడుకుంటూ ఎదగాలని నేను అనుకోలేదు. ఇక ఒక కో స్టార్ గా .. బంధువుగా కూడా మహేశ్ చేసే సూచనలు కూడా సింపుల్ గానే ఉంటాయని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!