Renudesai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మాత్రమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కూడా అందరికీ సుపరిచితమే. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తనకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తో విభేదాల కారణంగా తనకు విడాకులు ఇచ్చి పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఈమె ఒంటరిగా గడుపుతున్నారు. ఇక ఇటీవల పవన్ కుమారుడు అకీరా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అకీరాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయాలి అంటూ ప్రతిసారి పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ తో వాదనకు దిగుతూ ఉంటారు.
అయితే ఇటీవల తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈమె ఒక హార్ట్ టచింగ్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా అకీరా తన కడుపులో ఉన్న సమయంలో తీసినటువంటి వీడియో ఉండటం విశేషం.ఆ టైంలో తాను ఎనిమిది నెలల గర్భంతో ఉన్నానని, కడుపులో అకిరా ఉన్నాడని, నన్ను తల్లిగా ఎంచుకున్నందుకు థాంక్స్ అంటూ తన బిడ్డ ఇరవయ్యో ప్రాయంలోకి వచ్చేశాడని ఈమె పోస్ట్ చేశారు.
ఇరవయ్యో ప్రాయంలోకి వచ్చాడు..
ఈ విధంగా 20 సంవత్సరాల క్రితం అకీరా తన పొట్టలో ఉన్నప్పటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక అకిరా హీరోగా రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ తనకు మాత్రం హీరో కావడం ఇష్టం లేదంటూ ఈమె చెప్పకు వస్తున్నారు. అయితే అకీరా ఎటువైపు వెళ్ళాలి అనేది పూర్తిగా తన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని రేణు దేశాయ్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…