Renu Desai: రేణు దేశాయ్ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు. గత రెండు రోజులుగా ఈమెకు పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది.పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత పవన్ తో విడాకులు తీసుకొని రేణు దేశాయ్ దూరంగా ఉంటున్నారు.ఇలా ఈమె పవన్ కు దూరమైనప్పటికీ పవన్ అభిమానులు మాత్రం తరచూ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఏప్రిల్ 8వ తేదీ ఆకిరా పుట్టినరోజు సందర్భంగా ఒక నెటిజన్ మా అన్నయ్య కొడుకును చూపించండి తనని దాయకండి అంటూ కామెంట్ చేశారు. ఇలా నెటిజన్ కామెంట్ చేయడంతో మండిపడిన రేణు దేశాయ్ మీ అన్న కొడుకు ఏంటి? అకిరా నా కొడుకు అంటూ స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ మధ్య యుద్ధం మొదలైంది.
ఇకపోతే తాజాగా ఒక నెటిజన్ రేణు దేశాయ్ కి సలహా ఇస్తూ చేసినటువంటి పోస్ట్ పై రేణు దేశాయ్ స్పందించారు. ఈ క్రమంలోనే నెటిజన్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన ఇమేజ్ డామేజ్ చేయడం కోసమే ఇలా అతని యాంటీ ఫ్యాన్స్ మీకు తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు అందుకే మీరు ఇంస్టాగ్రామ్ సెట్టింగ్స్ మార్చుకొని కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయండి అంటూ సలహా ఇచ్చారు.
ఈ సలహా పై రేణు దేశాయ్ స్పందిస్తూ మండిపడ్డారు. ఈ సమాజంతో ఇదే పెద్ద సమస్య ఎవరి కోసమో నేను ఎందుకు మారాలి? మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏం తప్పు చేశాను?ఇలా సలహాలు ఇవ్వడం చాలా ఈజీ కానీ ఆ బాధ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…