Categories: FeaturedMovie News

ఆ ఇల్లు నా కష్టార్జితం… పవన్ అభిమానులకు, నాకు మధ్య చిచ్చు పెట్టకండి…

తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తనకు ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన పిల్లలు ఆద్య, అకీరా కోసం పవన్ ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అది ఆనోటా ఈనోటా పోయి రేణు దేశాయ్ వరకు వెళ్ళింది. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు రేణు దేశాయ్.. అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తున్నారో అర్ధం కావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పవన్ తన పిల్లలకోసం, నాకోసం ఎలాంటి ఆస్తిని ఇవ్వలేదని.. ప్రస్తుతం తన పిల్లలతో సంతోషంగా గడుపుతున్నానని అన్నారు రేణు. నేను నా జీవిత మనుగడకోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో శ్రమిస్తున్నాను.. పోరాడుతున్నాను. నా తండ్రి దగ్గర నుంచి కూడా ఒక్కరూపాయి తీసుకోలేదు.. అలాగే నా మాజీ భర్త పవన్ దగ్గర నుంచి కూడా అన్యాయంగా ఎలాంటి ఆస్తిని పొందలేదు. హైదరాబాద్ లో నేను కొన్న ఇల్లు నా కష్టార్జితం. నా కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని నేను కొనుక్కున్న ఇల్లు.

నిన్నటి నుండి మీడియా వారి నుండి ఎన్నో మెసేజస్, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఈ మ్యాటర్ సీరియస్ అయిందని అర్ధమయింది. వారు చెప్పింది విని నాకు చాలా బాధేసింది. అందుకే వివరణ ఇస్తున్నా.. అంటూ ఆవేదన చెందారు ఆమె. ఒక వార్తను రాసేటప్పుడు అది నిజమా..కాదా అని కనీసం ఆలోచన రాదా ? అని ప్రశ్నించారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకి.. ఆత్మ గౌరవానికి.. అస్తిత్వానికి… చివరికి నా ఉనికికే ప్రమాదం వస్తుందనే చిన్న ఆలోచన మీకెవరికీ రాదా? నాకు తెలిసినంత వరకు ఈ వార్త నా మాజీ భర్త పవన్ కు ఎలాంటి సంబందం ఉంది ఉండదు.. అయన వరకు ఈ వార్త వెళ్లి ఉండకపోవచ్చు.

నా జీవితాన్ని ఇప్పటి వరకు ఏ మగాడి సహాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికి, పోరాటానికీ గౌరవం ఉండకపోయినా పర్వాలేదు కానీ… ఇలాంటి వార్తలతో కించపరచకండి… నా బాధను అర్ధం చేసుకోకుండా మళ్ళీ నాకు, నా మాజీ భర్త అభిమానులకు మధ్య దయచేసి ఎటువంటి గొడవలు సృష్టించకండి. అని రేణు దేశాయ్ అన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago