కరోనా మహమ్మారి విజృంభణ తరువాత సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ కొత్తకొత్త వ్యాధులు భయపెడుతున్నాయి. ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల సతమతమవుతుండగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. వెక్సాస్ సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి బారిన పడే పురుషుల సంఖ్య పెరుగుతోందని ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలకే ప్రమాదమని తెలుపుతున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలోని నేషనల్ హ్యుమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ కొత్త వ్యాధిని కనిపెట్టారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో సిరల్లో రక్తం గడ్డకట్టడం, తరచుగా జ్వరం రావడం, మైలోయిడ్ కణాల్లో వాక్యూల్స్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో హానికరమైన జన్యువును గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యుడు బెక్ మాట్లాడుతూ ఈ కొత్త వ్యాధిని చూసి తాము కూడా ఆశ్చర్యపోయామని.. పురుషుల రక్త కణాలలో జన్యుపరమైన వైవిధ్యత ఉంటే మాత్రమే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి.
వైద్య నిపుణులు ఈ పరిశోధనల ఫలితాల సహాయంతో మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స అందించవచ్చని తెలుపుతున్నారు. ఇప్పటికే ఎన్నో వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…