పురుషులకు మాత్రమే సోకుతున్న కొత్త వ్యాధి.. శాస్త్రవేత్తల్లో టెన్షన్..?

0
234

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ కొత్తకొత్త వ్యాధులు భయపెడుతున్నాయి. ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల సతమతమవుతుండగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. వెక్సాస్‌ సిండ్రోమ్‌ అనే కొత్త వ్యాధి బారిన పడే పురుషుల సంఖ్య పెరుగుతోందని ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలకే ప్రమాదమని తెలుపుతున్నారు.

అగ్ర రాజ్యం అమెరికాలోని నేషనల్‌ హ్యుమన్‌ జీనోమ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ కొత్త వ్యాధిని కనిపెట్టారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో సిరల్లో రక్తం గడ్డకట్టడం, తరచుగా జ్వరం రావడం, మైలోయిడ్ కణాల్లో వాక్యూల్స్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో హానికరమైన జన్యువును గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యుడు బెక్ మాట్లాడుతూ ఈ కొత్త వ్యాధిని చూసి తాము కూడా ఆశ్చర్యపోయామని.. పురుషుల రక్త కణాలలో జన్యుపరమైన వైవిధ్యత ఉంటే మాత్రమే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌ లో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి.

వైద్య నిపుణులు ఈ పరిశోధనల ఫలితాల సహాయంతో మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స అందించవచ్చని తెలుపుతున్నారు. ఇప్పటికే ఎన్నో వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here