కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం సాయంత్రం శంషాబాద్ లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాద్ లోని మియాఖాన్ గూడా సమీపంలో ఉన్న కేసీఆర్ ఫేమ్ హౌస్ లీజ్ కు తీసుకున్నారు. అయితే నీటివనరుల దగ్గర నిర్మాణాలను నిషేధించే జీవో 111 ను ఉల్లంఘించి, 25 ఎకరాల సువిశాల స్థలంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మిచారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ బల్కా సుమన్ ఈ ఆరోపణలను ఖండించారు. అయితే ఇటీవలే స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ లోని వెళ్ళడానికి ప్రయత్నించారు. దానిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డ్రోన్ లను ఉపయోగించారు. ప్రయివేటు వ్యక్తుల ఆస్తులపై డ్రోన్లు ఉపయోగించడం చట్టరీత్య నేరం అంటూ కొంత మందిని అరెస్ట్ చేసారు పోలీసులు.
అయితే తాజాగా ఈ కేసులో A1గా రేవంత్ రెడ్డిని చూపిస్తూ కేసు ఫైల్ చేసారు పోలీసులు. దీనిపై తీవ్రంగా మంది పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవీంద్ర, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లు రేవంత్ రెడ్డి అరెస్ట్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గపాలన నడుస్తుందని అన్నారు. ఒక ఎంపీని ఇష్టానుసారంగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు జరుగుతన్న పరిస్థితులపై తమ గళం విప్పాలని కోరారు.
మరో పక్క రేవంత్ రెడ్డి అరెస్ట్ అనంతరం అయినను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దేనితో పోలీసులు రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…