Categories: FeaturedGeneral News

తన భర్త షాపింగుకు తీసుకెళ్లలేదని కోపంతో ఆరునెలల కూతురిని నేలకేసి కొట్టిన తల్లి !!

క్షణికావేశంలో ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు నేటి తరం. చిన్న చిన్న విషయాలకే అర్ధం లేని కోపం తెచ్చుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు చాలా చూస్తూనే ఉన్నాం. అంటువంటి అమానుషమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలో జరిగింది. తన భర్త మీద కోపంతో చేతిలో ఉన్న ఆరు నెలల కూతురిని విసిరి కొట్టింది ఈ తల్లి.. తీవ్రంగా రక్తం పోవడంతో మృతి చెందింది ఆరునెలల పసికందు.

ఆగ్రాలోని ఆలీఘడ్ ప్రాంతంలో రాంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ శర్మ, పింకీ శర్మ లు భార్యాభర్తలు. వీరిద్దరికి మూడేళ్ళ క్రితమే పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల బాబు మరియు ఆరునెలల పాప ఉన్నారు.. ఆ పాప పేరు సోని. అయితే హొలీ పండుగ దగ్గర్లో ఉండటంలో తన భర్తను షాపింగ్ కు తీసుకెళ్లామని అడిగినది పింకీ శర్మ.. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, మరోసారి వెళదామని ఆమెకు చెప్పాడు రాహుల్ శర్మ.. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో కోపంతో ఉగిపోయిన పింకీ శర్మ తన చేతుల్లో ఉన్న ఆరునెలల పాప సోనిను విసిరి కొట్టింది. దీనితో తీవ్ర గాయాలై రక్తం పోవడంతో ఆ పాప కొద్దిసేపటికే మృతి చెందింది. అయితే పింకీ, రాహుల్ శర్మల మద్య తరచూ గొడవలు జరుగుతుండేవని, అదే తరహాలో మరోసారి గొడవ జరగడమే కోపం అదుపుచేసుకోలేక కన్న కూతురిని కడతెరిచిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై ఆమె కుటుంభం సభ్యులు పోలీసుస్టేషన్లో కేసు పెట్టగా.. పోలీసులు హత్యానేరం కింద అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పనీర్ తయారీలో సీక్రెట్ ఏమిటో తెలుసా? మృదువైన పనీర్ కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!

ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…

57 minutes ago

వాటర్ ఫాస్టింగ్ లాభాలా? ప్రమాదాలా? నిపుణుల వివరణ!

ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…

1 hour ago

ముంబై ఓటములకు హార్దిక్ కారణమా? కెప్టెన్సీపై భారీ విమర్శలు

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…

2 hours ago

చిన్నారుల్లో పెరుగుతున్న SMA… రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఎందుకు అవసరం?

ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్‌ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…

2 hours ago

యోగా గురించి మీరు నమ్ముతున్నవి నిజమేనా? నిపుణుల హెచ్చరిక!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…

2 hours ago

15 ఏళ్లుగా సమోసాలకు దూరం.. అక్షయ్ సీక్రెట్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…

3 hours ago