అక్కినేని నాగార్జున తనయుడు, అక్కినేని అఖిల్ షూటింగ్ స్పాట్ లో గాయాలపైనట్టు తెలుస్తుంది. అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ సీన్ చితీకరిస్తుండగా అఖిల్ గాయపడ్డారు. అతని రైట్ హ్యాండ్ ఎల్బో స్థానంలో తీవ్రంగా గాయమైందని సమాచారం. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. అయితే యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో అఖిల్ గాయపడటంతో ఈ చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్ మొత్తం ఆపేసిందట. ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు అఖిల్ కు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అఖిల్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఈ నెల 10వ తేదీ వరకు అఖిల్ విశ్రాంతి తీసుకుంటాడని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…