ప్రస్తుతం కరోనా చైనా నుండి ఇండియాకి పాకింది. ఇండియాలో 28 కి పైగా కేసులు నమోదుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఈ వైరస్ పెద్ద ప్రమాదకమేమి కాదు గాని. ఈ వైరస్ కు సరైన మందు లేకపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు వైద్యులు.
అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఎవరిని వదిలిపెట్టడం లేదు.. నిన్ననే ప్రభాస్ వంటి స్టార్స్ కరోనా భయంతో మాస్క్ ధరించి తిరుగుతున్న దృశ్యాలు చూసాం. అయితే ఇప్పుడు ఐపీఎల్ వంతు వచ్చింది. అవును కరోనా దెబ్బకు ఐపీఎల్ సీజన్ 2020 పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇండియన్ క్రికెట్ లో ఐపీఎల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్ క్రేజ్ చూసి ఇతర దేశాలలో ఇటువంటి లీగ్స్ చాలా నే మొదలు పెట్టారు. అయినా సరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న క్రేజ్ ను అవి ఈమాత్రం బీట్ చేయలేకపోయాయి.
మరికొద్ది రోజులలో జరగబోయే ఐపీఎల్ 2020 సీజన్ కు ఇప్పటికీ కసరత్తులు మొదలెట్టేస్తాయి కొన్ని జట్లు. అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదుచూస్తున్న సమయంలో దేశంలో కరోనా దెబ్బకు అసలు లీగ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు తలెత్తాయి. ఒక వేళ జరగకపోతే ఎన్ని కోట్లు నష్టం వస్తుందో చెప్పలేం.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో కరోనా కలకలం మొదలైంది. ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రపంచ క్రీడారంగంపై కూడా దీని ప్రభావం చూపిస్తుంది. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు శ్రీలంకలో జరుగుతున్న టూర్ లో షేక్ హేండ్స్ నిషేదించారు. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఐపీఎల్ 2020 కూడా అనుకున్న సమయానికి జరుగుతుందా అనే అనుమానాల దృష్యా.. ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిటిష్ పటేల్ కరోనా వైరస్ ప్రభావం ఐపీఎల్ పై లేదని.. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేసారు. అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయమై స్పందించారు. మార్చి 12 న జరగబోయే సఫారీల సిరీస్ లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…