ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ గా నిలిచినా రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం అర్ధ రాత్రి గచ్చిబౌలి లోని ప్రిజమ్ పబ్ లో అత్యంత దారుణంగా దాడి జరిగింది. గత రాత్రి తన గర్ల్ ఫ్రెండ్ తో పబ్ కి వెళ్లిన రాహుల్ సింప్లిగంజ్. ఆమెపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించగా.. పక్కనే ఉన్న రాహుల్ వారిని నిలదీశారు. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దేనితో కోపోద్రిక్తులైన ఆ యువకులు బీరు బాటిల్ తో రాహుల్ సిప్లిగంజ్ తలపై కొట్టడంతో.. తీవ్ర రక్త స్రావంతో రాహుల్ గాయాలపాలయ్యారు.
దీనితో పబ్ నిర్వాహకులు హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ సింప్లిగంజ్ తలకు తీవ్రంగానే గాయాలైనట్టు సమాచారం. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు గాయపరిచిన వారిలో ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై రాహుల్ పోలీసులకు పిర్యాదు చేయలేదని సమాచారం. అసలు రాహుల్ ఈ ఘటనపై ఎందుకు ప్రిర్యాదు చేయలేదు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఘటనలో రాహుల్ తప్పుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రాహుల్ కావాలనే వారే వాళ్ళతో గొడవపడ్డాడా.. అందుకే వారు బీరు బాటిల్ తో రాహుల్ తలపై దాడిచేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈకేసును సైబరాబాద్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో రాహుల్ వెంట ఉన్నది పునర్నవీ నా లేక వేరే ఎవరైనా ఉన్నారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పై దాడి జరగడంపై అయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…