ఆరోగ్యం అనేది మనం తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. మన వంటిల్లే మన వైద్యశాల అని మన పూర్వీకులు ఆనాడే చెప్పడం జరిగింది. అందులో చెప్పుకోదగినది ఉసిరి కాయలు. ఉసిరి కాయలలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉసిరిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మ సంరక్షణ కు, కేశ సౌందర్యానికి సంబందించిన వాటిలో ఉసిరిని ఉపయోగిస్తారు. అనేక జబ్బులను ఉసిరి నివారిస్తుంది. ఇంకా ఉసిరితో కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం..
ఉసిరి కాయ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే విటమిన్ లోపం వలన కలిగే వ్యాధులు, కామెర్ల వంటివి రాకుండా నివారించవచ్చు. మల బద్ధకం ఉన్న వారు రోజు తమ ఆహారంలో ఉసిరిని తీసుకోవడం వల్ల ఆ సమస్యని తగ్గించుకోవచ్చు. రెండు చెంచాల ఉసిరి కాయ పొడిని రెండు చెంచాల తేనెలో కలిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
ఉసిరి ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. ఉసిరిని తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్-సి వల్ల ఆహారంలోని ఇనుము ను శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. ఉసిరికి శరీరంలో ఉండే అధిక కొవ్వు ను కరిగించే శక్తి ఉంటుంది. మరియు బరువు నియంత్రణలో ఉంటుంది. దాహం, కడుపులో మంట, ఆకలి లేకపోవడం, వాంతులు వంటి సమస్యలు, ఎనీమియా, హైపర్ అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
అంతేకాదు కంటి చూపు మెరుగు పర్చడంలో ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కళ్ళు ఎర్ర పడడం, దురద వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి కాయ పొడిని కలిపి ప్రతి రోజు తీసుకోవడం వలన కళ్ళకు చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. దీనికరణంగా కరోనా దరి చేరదు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…