Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆందోళనలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలించాయని మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని విషయాన్ని ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క కొనసాగుతున్నారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పీఠంలో ఎవరు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం ఎంపికతో పాటు సీఎల్పీ నేత ఎంపికపై నాయకులు చర్చించారు.
రేవంత్ రెడ్డికే అధికార పీఠం…
ఇలా ఈ చర్చలు అన్నింటిలో కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డికి మద్దతు లభించిందని దీంతో ఆయనని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ హైదరాబాద్ వేదికగా మరి కాసేపట్లో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తే త్వరలోనే ప్రమాణ స్వీకారపు ఏర్పాట్లు కూడా నిర్వహించబోతున్నారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…