Bandla Ganesh: బండ్ల గణేష్ ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్నారు. ఈయన మద్దతు తెలియజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మంచి విజయం అందుకోవడంతో బండ్ల గణేష్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది అనే విషయం తెలియడంతో ఈయన పెద్ద ఎత్తున డాన్స్ లు చేస్తే ఊరేగింపుగా వెళ్లారు. అలాగే రేవంత్ రెడ్డికి కూడా అభినందనలు తెలియజేశారు..
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఎంత సంతోషంగా ఉన్నటువంటి బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.అలాగే తెలంగాణ ఎన్నికలలో కూడా ఈయన బిజెపి పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎనిమిది స్థానాలలో పోటీ చేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ ఎక్కడ కూడా గెలవకపోవడం గమనార్హం. అయితే తాజాగా బండ్ల గణేష్ ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటేనే బాగుండదని తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో చూడాలనుకున్నాను. ఆయన స్థాయి వేరు కానీ ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను రేవంత్ రెడ్డితో కూడా పోల్చి కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ స్థాయి వేరు…
రేవంత్ రెడ్డి తండ్రి గారు తాతగారు ఎవరు కూడా రాజకీయాలలోకి రాలేదు కానీ ఈయన రాజకీయాలలోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ కూడా అలాగే కావాలని నేను కోరుకుంటున్నానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై బండ్ల గణేష్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి బండ్ల గణేష్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు తెలుపుతున్నానని ప్రకటించలేదు. ఈయన పవన్ కళ్యాణ్ ను ఆరాధించిన తన మద్దతు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ గ్రోత్ కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…