Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ తరచు విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే కొంతమంది బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంతో ఏదో ఒక కేసులో నన్ను కూడా ఇరికించి అరెస్టు చేస్తారని కేటీఆర్ పలు సందర్భాలలో తెలిపారు. ఇలా ఎన్ని కేసులు పెట్టి అరెస్టు చేసిన తనకు భయం లేదని గర్వంగా జైలుకుపోతాను అంటూ కేటీఆర్ తెలియజేశారు.
ఇలా కేటీఆర్ జైలుకు పోవడం గురించి మాట్లాడటం పట్ల తాజాగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ జైలుకు ఎందుకు పోతానంటున్నాడు తన తాపత్రయం ఏంటో నాకు బాగా అర్థమైందని తెలిపారు. ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన వారందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు అందుకే తాను కూడా జైలుకు వెళ్లాలని కేటీఆర్ తాపత్రయ పడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేటీఆర్ జైలుకు వెళ్లిన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఈ సందర్భంగా రేవంత్ తెలిపారు. కెసిఆర్ ఫ్యామిలీలో ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాటలు జరుగుతున్నాయని ఈ లెక్కన జైలుకు వెళ్లి వచ్చిన వారు ముఖ్యమంత్రి అయితే కనుక ముందుగా జైలుకు వెళ్ళింది కవిత కనుక ఆమె ముఖ్యమంత్రి అవుతారు కానీ కేటీఆర్ కు ఛాన్స్ లేదంటూ కామెంట్లు చేశారు.
ఇలా రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్టు గురించి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిజంగానే కెసిఆర్ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయా అనే విషయం పట్ల చర్చలు జరుపుతున్నారు. ఇక తెలంగాణ సర్కార్ తీరు పట్ల నిత్యం కేటీఆర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో అలాగే మీడియా సమావేశాలలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…