devotional

Tirumala: శ్రీ వారి ఆలయంలో చోరీ… భద్రతా చర్యల పై మండిపడుతున్న భక్తులు!

Tirumala: కలియుగ దైవం, ఏడుకొండల వాడు… వడ్డీ కాసుల వాడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగిందని విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆపద మొక్కుల వాడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇలా భక్తుడు ఏకంగా స్వామివారి హుండీలో దొంగతనం చేయడం పట్ల భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ ఘటన నవంబర్ 23వ తేదీ జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిత్యం స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది తిరుమలకు చేరుకుంటారు. కొండపై నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఇలాంటి ఆలయంలో భక్తుడిగా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి స్వామివారి దర్శనం కోసం వెళ్లారు అయితే ఈయన హుండీలో నుంచి 15000 రూపాయలను దొంగలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది.

ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ పారిపోయాడని సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్న జ్ఞానేంద్ర అనే ఆపరేటర్ గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే అతనిని ట్రేస్ చేసి నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు అరెస్టు చేయడమే కాకుండా తమదైన శైలిలోనే విచారణ చేయడంతో దొంగలించిన 15 వేల రూపాయలను తిరిగి వెనక్కి ఇచ్చారు.

Tirumala: 15 వేలు…

ఇక ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనగా మారింది. ఓ భక్తుడు స్వయంగా హుండీలో డబ్బులను చోరీ చేస్తుంటే అక్కడ భద్రత చర్యలు ఎలా ఉన్నాయో స్పష్టం అవుతుందని భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago