Nagachaitanya -Sobhita: సినీ నటుడు నాగచైతన్య శోభిత వివాహానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 4వ తేదీ వీధి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఇలా డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా వీరి హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో రాత్రి 8 గంటలకు వీరి వివాహం బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం జరగబోతుంది.
ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అది కొద్ది మంది సినీ సెలబ్రిటీలు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని స్వయంగా నాగార్జున ఒక సందర్భంలో వెల్లడించారు. ఇలా నాగచైతన్య శోభిత వివాహానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ముందస్తు పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
తాజాగా నాగచైతన్య శోభిత ఇద్దరికీ ఒకే చోట హల్దీ వేడుకను నిర్వహించడమే కాకుండా ఇద్దరికీ కలిపి మంగళ స్నానాలు చేయించారు అనంతరం శోభిత పలు పూజలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఈ ఫోటోలు వైరల్ అవడంతో అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…
భారత్‌లో ఆదివారం అంటే చాలామందికి ఇంటి పనుల రోజు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా వారం మొత్తం బిజీగా గడిపే…
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…