Amala: నటుడు నాగార్జున భార్యగా నటి అమల అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న అమల సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక ప్రస్తుతం అక్కినేని కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకలలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా అక్కినేని ఇంట పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో అమల తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాగచైతన్య విషయంలో ఈమె సొంత తల్లిలా కాకుండా సవతి తల్లి లాగానే వ్యవహరిస్తోంది అంటూ చైతన్య అభిమానులు కాస్త మండిపడుతున్నారు.
ఇటీవల అఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమల సోషల్ మీడియా వేదికగా తన కొడుకు అఖిల్ కాబోయే కోడలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం గురించి తెలియజేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ పోస్టుకు ఈమె కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారు.
ఈ ఏడాదిలోనే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం కూడా జరిగింది అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించి అమల ఎక్కడ పోస్ట్ చేయలేను కానీ తన కొడుకు అఖిల్ నిశ్చితార్థం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈమె నాగచైతన్య అఖిల్ విషయంలో వ్యత్యాసం చూపుతోందని నాగచైతన్యను సొంత కొడుకులాగా అంగీకరించలేకపోతున్నారు అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే ఈమె కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేశారు అంటూ నాగచైతన్య అభిమానులు అమల తీరుపై మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…