RGV : నిత్యం వివాదాలలో మునిగి తేలే జీవి ఆర్జీవి. ఆయనే ఒక వివాదం అవుతాడు లేదా ఆయన చుట్టూ ఏదైనా వివాదం ఉంటుంది. అందరికీ కోపం తెప్పించేలా మాట్లాడి వినోదించే ఆర్జీవి మొదటి సారిగా ఒకరిపై కోపం పెట్టుకున్నారు. ఎప్పుడు ఛిల్ల్ గా ఉండే ఆర్జీవికి కోపం వచ్చేసింది. ఆర్జీవి తెగ ఫైర్ అయిపోతున్నాడు. ఇంతకీ విషయమేంటంటే నట్టి కుమార్ చాలా రోజుల క్రితం ఆర్జీవి పై ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. డబ్బు విషయంలో మోసం చేసాడని అందరిని మోసం చేస్తూ సినిమాలు తీస్తున్నాడని ముంబై ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ లను మూసేసి పారిపోయాడు అని ఆరోపించాడు.
నట్టి కుటుంబం పై కేసు….
ఇక ఆర్జీవి ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నట్టి క్రాంతి, నట్టి కరుణ పై కంప్లయింట్ ఇచ్చాడు. తన డేంజరస్ సినిమా సమయంలో తనను చాలా డిస్టర్బ్ చేసారని, తనను 50 లక్షలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టానని అగ్రిమెంట్ పుట్టించి దొంగ సంతకాలు చేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారని ఆర్జీవి ఆరోపించారు. ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న చిరునామా, సంతకం రెండు నావి కావని, నేను ఏ హామీ పాత్రలు ఇవ్వలేదని చెప్పారు. కోర్ట్ ని కూడా తప్పుదోవపట్టించారని ఆరోపించారు. వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటూ హెచ్చరించారు. ఇక తనపై నట్టి కుమార్ కేసు పై ప్రశ్న అడుగగా అది అదే ఇది ఇదే అంటూ స్పందించారు.
నట్టి కుమార్ ఫైర్…..
ఆర్జీవిపై కేసు వేసిన నట్టి కుమార్ ఇపుడు ఆర్జీవి కేసు వేసిన ఉదంతం పై స్పందించాడు. ఆర్జీవి పై ఫైర్ అయ్యాడు. తనతో పాటు మోసపోయిన అందరు నన్ను కలుస్తున్నారు, కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇపుడు నేను స్పందించకూడదు అంటూ మాట్లాడారు. తనపై ఆరోపణలు నిజం కాకపోతే నిరూపించుకోవాలని తన హైదరాబాద్, ముంబై ఆఫీసులను ఎందుకు ఖాళీ చేసి దుకాణం ఎత్తేసి తిరుగుతున్నాడని తీవ్రంగా ఆరోపించాడు నట్టికుమార్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…