RGV : ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న ప్రోగ్రామ్స్ లో అలీతో సరదాగా కూడా ఒకటి. ఆలీతో సరదాగా కి హీరో అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు, ఈ ప్రోగ్రాం ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు టాప్ రేటెడ్ ప్రోగ్రాంలలో ఒకటిగా గా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం ద్వారా చాలా మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసారు అలీ. తాజాగా ఆలీతో సరదాగా లో ఆర్జీవీ సందడి చేశారు. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా అది చాలా మంది ప్రేక్షకుల మదిలో ఉన్న ప్రశ్నలలో ఆర్జీవి ని అడగడం జరిగింది.
తన ఆటిట్యూడ్ పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవి……
చాలా మంది బ్రతికితే జీవితం లో ఒక్కసారైనా ఆర్జీవి లా బ్రతకాలి అని అనుకుంటుంటారు. ఎవరికీ భయపడకుండా.. ఏం చేయాలి అని పిస్తే అది చేస్తూ బిందాస్ గా బ్రతకాలి అని ఎవ్వరికి ఉండదు చెప్పండి. కానీ అలా బ్రతకడం చాలా కష్టం. అయితే ఇదే ప్రశ్నను అలీ మీలా బ్రతకాలి అంటే ఏం చేయాలి అని ఆర్జీవి ని అడుగగా… అందుకు ఆర్జీవి జీవితం లో మూడు విషయాలు అయిన సమాజం, కుటుంబం, దేవుడు అనే వీటిని వదిలేస్తే నాలా బ్రతకోచ్చు అని సమాధానం ఇచ్చారు. కాగా ఇందుకు అలీ మీ నాన్న గారు కూడా ఇలా అలోచించి ఉంటే మీరు ఉండేవారు కాదు కదా అని అడుగగా.. మా నాన్న కు తెలివి లేదని నాకు కూడా ఉండొద్దా అని సమాధానం ఇచ్చారు.
ఇక సినిమా ల విషయం గురించి ప్రస్థావిస్తూ మీరు తీసిన సినిమా ప్లాప్ అయితే దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అని అడుగగా..నేను ఒక సినిమా తీసిన తర్వాత మరి దాని గురించి పట్టించుకోను. మరొక సినిమా తీసే పనిలో వుంటాను అని అయన తనదయినా స్టైల్ లో సమాధానం ఇచ్చారు.బర్తడే పార్టీలకు చాలా దూరంగా వుండే మీరు ఈ మధ్య పార్టీలు ఎక్కువగా చేసుకుంటున్నారు అని అలీ అడిగారు. దీనికి సమాధానంగా ఈ మధ్య అమ్మాయిలు నాకీ పార్టీలు ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, అని వ్యాంగ్యంగా సమాధానం ఇచ్చారు. అయితే ఆర్జీవి తో అలీ ప్రోగ్రాం వచ్చేవారజం ప్రసారం కాబోతోంది. దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…