Categories: FeaturedMovie News

‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్ కు కూడా టిక్కెట్ పెట్టి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ !

ఎడారిలో ఇసుకను అమ్మగలిగేంత అపర మేధావి మన రామ్ గోపాల్ వ‌ర్మ. ఆయన తెలివి తేటలకు నిదర్శనంగా ఈమధ్య ఆన్ లైన్లో విడుదలైన వర్మ చిత్రాలనే చెప్పవచ్చు. ఒకప్రక్క షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడ్డ ఈ లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. తన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ద్వారా ఆన్ లైన్లో సినిమాలను విడుదల చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.

ఈమధ్యకాలంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు రూ.100 టికెట్ పెట్టి కోట్లు సంపాదించిన వర్మ.. ఆ తర్వాత ‘నగ్నం’ పేరుతో లోకల్ బీ గ్రేడ్ బూతు బొమ్మకు రూ.200 టికెట్ పెట్టి దాని ద్వారా కూడా బాగానే సంపాదించాడు. ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకోవడం బాగా అలవాటు చేసుకున్న రాంగోపాల్ వ‌ర్మ‌ ఇప్పుడు ఏకంగా ట్రైల‌ర్‌కీ టికెట్టు పెట్టి పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నాడు. వివరాల్లోకి వెళ్ళే.. తాజాగా ఆన్ లైన్ లో రామ్ గోపాల్ వర్మ విడుదల చేయబోతున్న కొత్త సినిమా ‘పవర్ స్టార్’. పవన్ కళ్యాణ్‌ ను టార్గెట్ చేసి తీసిన సినిమాగా ఈ చిత్రం కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘తొలి ప్రేమ’ చిత్రం విడుదలైన రోజే అంటే జులై 24నే ఈ చిత్రం కూడా రిలీజవుతుందని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.

ప‌వ‌ర్ స్టార్‌ సినిమా ఎలా వున్నా, అందులో ఏమున్నా, ప‌వ‌న్ ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్ చూస్తార‌ని వ‌ర్మ ఆశ‌. పైగా ఇది ప‌వ‌న్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి క్రేజ్ కాస్త ఎక్కువ‌గానే వుంటుందని వర్మ అంచనా. సో.. ఆ క్రేజ్ ని ట్రైల‌ర్ నుంచే క్యాష్ చేసుకోవాల‌ని ఆరాటప‌డుతున్నాడు. కనుక అందరిలాగ ‘పవర్ స్టార్’ ట్రైలర్ ను యూ ట్యూబ్‌ లో ఫ్రీగా చూపించదల్చుకోలేదు వర్మ. ఆ ట్రైలర్ ను చూడటానికి కూడా రేటు పెడుతున్నాడు. సుమారు రూ.50 దాకా టికెట్ పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరట. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలిం మేకర్ మన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మే కావచ్చు. సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అందరూ ట్రైలర్ చూస్తారు. కానీ దానికి కూడా రేటు పెట్టాలన్న వర్మ ఆలోచన నిజంగా అద్భుతం. ట్రైల‌ర్ చూస్తే గానీ, సినిమాపై ఓ అంచ‌నాకు రాలేం. జ‌న‌మంతా ట్రైల‌ర్ చూసి, సినిమా చూడ‌రేమో అన్న‌ది వ‌ర్మ డౌటు. అందుకే రేటు పెట్టాడు. వ‌ర్మ నుంచి ఏ చిన్న వీడియో వ‌చ్చినా జ‌నం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. దాన్నే ఇప్పుడు క్యాష్ చేసుకోవాల‌నుకుంటున్నాడు. వర్మా… కరోనా టైంలో ఏంటీ ఖర్మా.?!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago