RGV Heroin: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న నిజం అందరికీ తెలిసిందే.అవకాశాల కోసం ఇండస్ట్రీ లోకి వచ్చిన వారికి తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయితే డైరెక్టర్లు నిర్మాతలు అడిగిన విధంగా వారికి కమిట్మెంట్ ఇవ్వడం వల్లే అవకాశాలు వస్తాయని,ఇలా వారు చెప్పిన విధంగా వినకపోతే వారికి ఇండస్ట్రీలో ఏమాత్రం మనుగడ ఉండదని చాలామంది భావిస్తుంటారు.
ఈ క్రమంలోనే నిన్నటి తరం హీరోయిన్ల నుంచి ఈతరం హీరోయిన్ల వరకు కూడా ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎంతోమంది తారలు బహిరంగంగా వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టారు. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మరొక హీరోయిన్ నోరు విప్పారు.
రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా సందడి చేసిన అప్సర రాణి గురించి పరిచయం అవసరం లేదు.ఇలా ఈ హీరోయిన్ తో ఆర్జీవి ఎంతో చనువుగా ఉండటమే కాకుండా ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది.
ఈ సినిమా అనంతరం ఈమె వరుసగా రాంగోపాల్ వర్మ సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కెరియర్ మొదట్లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ తనకు అవకాశం ఇస్తే తన ఆఫీసుకు వెళ్లి కలిశానని అయితే ఆయన లోపల గదిలోకి తీసుకెళ్లి తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానని,ఆయన అలా అడిగేసరికి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఈమె ఈ సందర్భంగా కెరీర్ మొదట్లో తనకు జరిగిన అనుభవం గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…