Categories: FeaturedMovie News

నా వల్లే జగపతిబాబు కోట్లు సంపాదించాడు..! బోర్ కొడితే ఇంటికి పిలిచేవాడు..!! – హాట్ బ్యూటీ శ్రీ రాపాక !

అదృష్టం ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. సినిమాల్లో రాణించాలని కోటి కలలతో వచ్చేవారికి ముందు అవమానాలు, ఆపై చిన్న చిన్న అవకాశాలు, ఎలాగోలా తమ టాలెంటును చూపించి నెట్టుకొస్తుంటారు. ఇంకా కొందరైతే ఒక్క ఛాన్స్ కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు తెగిస్తారు. కానీ, అలాంటి కష్టాలేం పడకుండానే ఇప్పుడో తెలుగమ్మాయి టాలీవుడ్ ని ఏలేందుకు సిద్ధమైపోయింది.

శ్రీ రాపక తెలుగు సినిమా రంగంలో ఈ పేరు కొత్తేం కాదు. అల్లు అర్జున్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలకే కాదు, ఆది లాంటి చిన్న హీరోలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. పాతికేళ్లు కూడా లేని ఈ హైదరాబాదీ అమ్మాయి ముందు హీరోయిన్ కావాలనే టాలీవుడ్ లోకి వచ్చింది. అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటంతో డిజైనర్ అవకాశం ఎత్తింది. బేసిక్ గా పొడవుగా వుండి, ఆ పొడవుకు తగ్గ అందం కూడా ఆమె సొంతం కావటంతో దర్శకులు, నిర్మాతల కన్ను ఆమెపై పడి ఇప్పుడు సినిమా ఆఫర్లు ఇచ్చేందుకు ఆమె వెంట పడుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోతగ్గ గొప్ప విషయమేమిటంటే.. హీరోయిన్ ఛాన్స్ కోసం ఆమె ఎవరి వెంట పడలేదు. కేవలం తన ఫోటో షూట్ లతోనే ఆమె సినిమా ఛాన్స్ లను రాబట్టుకుంది. ఈమధ్యనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘న గ్నం’ చిత్రంలో నటించి సంచలనం సృష్టించిన శ్రీ రాపాక లేటెస్ట్ గా మన టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబుతో తనకు మంచి స్నేహమే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. జగపతి బాబు పై హాట్ బ్యూటీ శ్రి రాపాక చేసిన హాట్ కామెంట్స్ సారాంశమేమిటంటే.. “శ్రీ అంటే లక్ష్మీ దేవి అని అర్ధం. కాబట్టి నేను ఎవరి లైఫ్‌లోకి ఎంటరైతే వాళ్ల లైఫ్ ఖచ్చితంగా మారిపోతుందన్నమాట.. ఉదాహరణకు హీరో జగపతిబాబు గారు నాకు 2013లో పరిచయమైన సమయానికి సినిమా కెరీర్ పరంగా ఆయన నష్టాల్లోనే వుంటూ కష్టాలు పడుతుండేవారు. అప్పటికే ఆయన జూబ్లీ హిల్స్‌లో వున్న ఇళ్లని కూడా అమ్మేశారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం గులాబీ హౌస్‌లో షూటింగ్ జరుగుతున్న టైంలో కి నేనెక్కువగా జగపతిబాబు గారితో మాట్లాడేదాన్ని..
ఒకరోజు ఆయన చాలా మూడ్ ఆఫ్ గా వుండటం చూసి ‘ఎందుకు సార్ అలా డల్ గా ఉన్నారు.?’ అనడిగాను. అప్పుడాయన ‘నీకేం తెలుసు తింగరి.. మనిషన్నాక చాలా కష్టాలుంటాయి.. నువ్ చిన్న పిల్లవి.. నీకేమీ తెలీదు.’ అనేవారు. ‘మరేం ఫర్లేదండీ నాతో చెప్పండి.!’ అనే వాదించేదాన్ని. ‘ ఏం.. నీతో చెప్తే ఆరుస్తావా? తీరుస్తావా?’ అని కోప్పడేవారు. ‘ఏమో.. ఆరచొచ్చు.. తీర్చొచ్చు.. ఇంకేదైనా జరగొచ్చు కదా.’ అని అడిగి మరీ తెలుసుకునేదాన్ని. ఆ విధంగా మా ఇద్దరిదీ చాలా మంచి స్నేహం.

ఆయన చాలాసార్లు డిప్రెషన్‌ లో ఉన్నప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా నాతో షేర్ చేసుకునేవారు. నేను కూడా ఆయన కోసం ఎక్కువ టైం కేటాయించేదాన్ని. ఆయన నటించే చిత్రాల షూటింగ్ స్పాట్ కి ప్రత్యేకించి వెళ్ళేదాన్ని.. అలాగే ఆయనకు బోర్ కొట్టినప్పుడల్లా నన్ను రమ్మనేవారు. ఈవిధంగా హ్యాపీగా కొనసాగిపోతున్న మా స్నేహ ప్రయాణంలో.. ఆయన టెన్షన్ పడుతున్న ప్రతిసారీ ‘మీరు ఎక్కువ ఆలోచించకండి సార్.. మీ లైఫ్‌లోకి ఈ శ్రీ అడుగు పెట్టిందంటే మీరు జీరో స్ధాయి నుండి మళ్ళీ హీరో స్ధాయికి వెళ్ళిపోతారంతే..!’ అని చెప్పేదాన్ని. నేన్నట్టుగానే అదే నిజమైంది. ఆ తర్వాత ఆయన కొన్ని కోట్లు సంపాదించారు. ఆ సంగతి మీకూ తెలుసు.! ఇప్పటి వరకూ హీరోగా ఆయనెంత సంపాదించాడో నాకైతే తెలియదు కాని.. ఇప్పుడాయన రెట్టింపు సంపాదిస్తున్నారు.

అంటే ఆ క్రెడిట్ అంతా నాదేనన్నమాట.! దీనర్ధం మొత్తం నేనే చేశాను.. నావల్లే ఇదంతా జరిగిందని కాదు. జస్ట్.. ఆయనకు పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్ చేశానని చెప్తున్నానంతే.! మంచి మనస్సుతో మన నోటి వెంట వచ్చే మంచి మాటలకు తధాస్తు దేవతలు దీవిస్తారంటారు. నిజానికి జగపతిబాబు గారు ఇప్పుడింతిలా సంపాదిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు’ అంటూ జగపతి బాబుతో తనకున్న మైత్రి గురించి ముచ్చటించింది ముద్దుగుమ్మ శ్రీ రాపాక. ప్రస్తుతం కోలీవుడ్ లో వైభవ్, విజయ్ సేతుపతి లాంటి హీరోల పక్కన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ తెలుగు బ్యూటీ. అలాగని టాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదని మాత్రం అనుకోకండి. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. సహనంతో ఉంటే విజయాన్ని సాధించవచ్చు అన్న ఫిలాసఫీయే ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలను తెచ్చి పెడుతుందని చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది శ్రీ రాపాక.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago