క్యాస్టింగ్ కౌచ్.. సినీ రంగాన్ని పట్టి పీడిస్తున్న పెను భూతం. గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ కు బలైన కొంతమంది సినీతారలు ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండటంతో గత 2 సంవత్సరాల నుండి ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సెన్సేషనల్ సినీ నటి శ్రీ రెడ్డి ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై పెద్ద ఉద్యమాన్నే లేవనెత్తి టాలీవుడ్ మొత్తాన్నీ షేక్ చేసేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి సినిమా రంగంలో తమకు జరిగిన అన్యాయాలపై ఒక్కొక్క హీరోయిన్ నోరు విప్పడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ చాలా మంది నటీమణులు స్ట్రాంగ్ గా చెబుతూ.. తమకెదురైన చేదు అనుభావాలను సోషల్ మీడియా లోని నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే..
తాజాగా.. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంపై టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క స్పందించింది. లేటెస్ట్ గా ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నటి అనుష్క మాట్లాడుతూ.. ‘తాను కూడా సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వేధింపుల బారిన పడ్డానని, టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, ఇందులో రహస్యమేమీ లేదని, చిత్ర పరిశ్రమలో ఇలాంటివన్నీ సర్వ సాధారణంగా జరుగుతూనే వుంటాయని, అయితే.. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండడం వలనే ఈ క్యాస్టింగ్ కౌచ్ బారి నుంచి తప్పించుకోగలిగానని ఈ సందర్భంగా అనుష్క తెలియజేయడంతో సోషల్ మీడియాలో మరోసారి ఈ టాపిక్ బాగా వైరలవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…