Categories: FeaturedMovie News

బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేయబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్

టాలీవుడ్‌ లో క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలోనే వ‌రుసగా పెళ్లిళ్లు జరిగి పోయాయి. యంగ్ హీరోల దగ్గర్నుంచి టాలీవుడ్ ద‌ర్శ‌కుల వరకూ అందరూ పెళ్లి బాట ప‌ట్టడం విశేషంగా చెప్పవచ్చు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి దగ్గర్నుంచి మొదలైన ఈ పెళ్ళిళ్ళ హంగామా నిఖిల్‌, నితిన్‌, రానా, ద‌ర్శ‌కుడు సుజిత్ వరకూ కొనసాగింది. సందట్లో సడేమియా అన్నట్లుగా త్వ‌ర‌లోనే మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక పెళ్ళి కూడా జ‌ర‌గి పోతుంది. అయితే.. వీళ్ళందరి బాటలో పయనించాలని స్ట్రాంగ్ గా ఫిక్సైన యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేయబోతున్నాడు. మెగా హీరో రామ్‌ చ‌ర‌ణ్ స్టైల్ లోనే త‌న బాల్య స్నేహితురాలిని శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని తాజా సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్ ప్రారంభం నుంచి తానెంచుకునే కథలు, పాత్రలు చాలా భిన్నంగా వున్నాయనే చెప్పవచ్చు. 1984లో విజయవాడలో పుట్టిన శర్వానంద్ మొదటి సారిగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘థమ్సప్ యాడ్’ లో కన్పించాడు. ఆ తర్వాత నటుడిగా 2003 లో ‘ఐదోవ తారీఖు’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ ఆ తర్వాత శంకర్ దాదా MBBS, సంక్రాంతి, లక్ష్మీ వంటి చిత్రాల్లో కొన్ని విభిన్నమైన పాత్రలలో నటించాడు. హీరోగా శర్వానంద్ కు లైఫ్ ఇచ్చింది మాత్రం క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గమ్యం’ చిత్రమేనని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత ‘అందరి బంధువయ’ చిత్రంతో నటుడిగా మెప్పించిన శర్వానంద్.. ‘ప్రస్థానం’ లాంటి క్లాసిక్ మూవీతో పరిపూర్ణ నటుడిగా మారి పోయాడు. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘రన్ రాజా రన్’ చిత్రంతో హిలేరియస్ హిట్ కొట్టిన శర్వానంద్ తన సినిమా కెరీర్ లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి హిట్లను సాధించాడు.

పోయిన సంవత్సరం ‘రణరంగం’ చిత్రంతో నిరాశ పర్చిన శర్వానంద్ కి ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ‘జాను’ చిత్రం కూడా పెద్దగా సక్సెస్ నివ్వలేకపోయింది. తను నటించిన సినిమాలు హిట్టైనా.. కాకపోయినా ప్రతి చిత్రంలోనూ నటుడిగా తనని తాను నిరూపించుకుంటున్నాడు శర్వానంద్. ఇండ‌స్ట్రీలో సుమారు 16 ఏళ్లుగా సినిమాలలో నటిస్తున్న శర్వానంద్ ప్రస్తుత వ‌య‌స్సు 36. తాజాగా తన బాల్య స్నేహితురాల‌ని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధ‌మైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేయడంతో.. శర్వానంద్ ను పరిణయమాడబోయే ఆ అమ్మాయి ఎవరు.? అనే ఆసక్తి శర్వానంద్ ఫ్యాన్స్ లో మొదలైంది.

ఆమె మ‌రెవ‌రో కాదు.. ఓ మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ అని, శర్వానంద్ బాల్య స్నేహితురాలని, ఈమధ్యనే ఆమె బిజినెస్‌లో బాగానే సెటిలైందని, యువ మహిళా వ్యాపారవేత్తగా కూడా ఆమె మంచి పేరును సంపాదించుకుందని ఫిలిమ్ నగర్ టాక్.. గత కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వీరిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్ధ‌లు కూడా ఓకె చెప్పేయడంతో మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరూ ఒక్క‌ట‌య్యేందుకు సిద్ధమౌతున్న‌ట్లుగా తెలిసింది. త్వ‌ర‌లోనే వీళ్ళిద్దరి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం శ్రీ‌కారం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మ‌హా స‌ముద్రం, యువీలో ఓ మూవీ, ఏషియ‌న్ ఫిలింస్‌లో మ‌రో మూవీలోనూ నటించబోతున్నాడు శర్వానంద్. ఇక శర్వానంద్ పెళ్లి వార్త‌ల్లో నిజ‌మెంత వుందో తెలియాలంటే స్వ‌యంగా శ‌ర్వానంద్ ప్ర‌క‌టించేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago