ఈమధ్యనే ఓటీటీలో విడుదలైన “న గ్నం” చిత్ర కధానాయిక శ్రీ రాపాక అలియాస్ స్వీటీ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బోల్డ్‌గా నటించడమే కాకుండా ప్రతి ఒక్కరి గురించి బోల్డ్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా స్వీటీ యూట్యూబ్ ఛానెళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈసారి ఏకంగా పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేసింది. పవన్‌కల్యాణ్ అంటే తనకు క్రష్ అనీ, అతనితో డేటింగ్ కి కూడా సిద్ధమేనంటూ రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈమధ్య తెరకెక్కించిన “న గ్నం” మూవీలో హీరోయిన్‌గా నటించిన స్వీటీ తన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా వరుసగా ఇంటర్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది.
అలాగే ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వూలో స్వీటీ మాట్లాడుతూ.. “టాలీవుడ్ హీరోల్లో నాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన్ని కలవటానికి చాలా సార్లు ప్రయత్నించాను. కానీ, వీలుపడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయన్ని కలవడానికి ఎవరి రికమండేషన్ తీసుకోవడం నాకిష్టం లేదు. నిజంగా ఆయన్ని కలిసే సమయమొస్తే తప్పకుండా కలిసి తీరతాను. ఇంకా ఒక్కముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే నాకెంత ఇష్టమంటే ఆయన నన్ను డేటింగ్‌కి రమ్మన్నా వెంటనే ఓకే చెప్పేస్తాను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని నా ఆశ” అని తెలియజేసింది. అదండి సంగతి.. మొత్తానికి అమ్మడు ఆశను మన పవర్ స్టార్ తీరుస్తాడో లేదో వేచి చూడాలీ.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…