బిత్తిరి సత్తి, ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు.. ఇలా ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో జీవించే మంచి నటుడు బిత్తిరి సత్తి ఉరఫ్ రవి కుమార్. బుల్లితెరపై బిత్తిరి సత్తి అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. జీరో స్ధాయి నుంచి హీరో స్థాయి వరకూ ఎదిగిన బిత్తిరి సత్తి అసలు ప్రయాణం మొదట వీ6 ఛానెల్ తోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి సడెన్ గా వీ6 ఛానెల్ నుండి తప్పుకుని TV 9 ఛానెల్ లోకి జంప్ చేసేశాడు మన తుపాకీ రాముడు.
టివీ9 లో కూడా తీన్మార్ వార్తలు లాగే ‘ఇస్మార్ట్ న్యూస్’ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. కానీ ఆ ప్రోగ్రాం ఆశించినంతగా సక్సెస్ కాలేదు. దాంతో టీవీ 9 టీఆర్‌పీలు పడిపోవడమే కాకుండా ఆమధ్య ఫాదర్స్ డే సందర్భంగా బిత్తిరి సత్తి చేసిన ఓ ప్రోగ్రామ్ ఛానెల్ యాజమాన్యం ఆగ్రహానికి గురైంది. దాంతో వెంటనే బిత్తిరి సత్తిని టివీ9 ఛానెల్ నుంచి తొలగించారు. అయితే టీవీ9 కావాలనే బిత్తిరి సత్తిని తొలగించిందని, కాదు, కాదు అతనే కావాలని బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. అప్పట్లో సోషల్ మీడియాలో గాసిప్స్ హల్ చల్ చేశాయి. తాజాగా ఈ రూమర్స్ అన్నిటికీ తెర దించుతూ మన బిత్తిరి సత్తి ఓ సరిక్రొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇకపై అతను సాక్షి టీవీలో కనిపిస్తున్నాడు. ఇటీవలే సాక్షి టీవీ ఛానల్ యాజమాన్యంతో బిత్తిరి సత్తి ఒప్పందం విజయవంతమైనట్లు తాజా సమాచారం. అలాగే గతంలో టీవీ9 వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ మొత్తానికే మన బిత్తిరి సత్తి ఒప్పుకున్నట్లుగా తెలిసింది.
నిన్నటి వరకు వీ6 న్యూస్, టీవీ9లలో సత్తి 2 విభిన్న గెటప్‌లలో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. కానీ “తుపాకీ రాముడు” చిత్రం తర్వాత సాక్షిలో మరో కొత్త అవతారంలో కనబడుతూ.. తనదైన శైలిలో అందర్నీ అలరించడానికి సిద్ధమౌతున్నాడని టాక్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. టీవీ9 నుంచి బయటకొచ్చేసిన బిత్తిరి సత్తి ముందుగా బిగ్‌బాస్ షోలోనే పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ అంతకన్నా ముందుగా అతను సాక్షి టివీలో కనబడబోతున్నాడనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బిగ్‌బాస్ గనక ప్రారంభమైతే అందులో మన బిత్తిరి సత్తి పాల్గొంటాడా లేదా.. అన్న సందేహాన్ని ప్రక్కన పెడితే.. బిగ్ బాస్‌లో పాల్గొనే ఛాన్స్ నిజంగా వస్తే సాక్షి T.v బిత్తిరి సత్తికి ఆ షోలో పాల్గొనే అనుమతి ఇస్తుందనే ఊహాగానాలు బయటికొస్తున్నాయి. ఏదేమైనా.. మన తుపాకీ రాముడు సాక్షి ఛానల్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవ్వడం బిత్తిరి సత్తి అభిమానులందరికీ క్రొత్త ఉత్సాహాన్నిస్తోంది.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…