సాయి పల్లవి ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే సినిమా ఫిదా. తన మొదటి సినిమాతోనే యూత్ ని బాగా ఆకర్షించిన సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి. ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా ఒక కీలకమైన వారు అయిపోయారు. మొదటి సినిమాతోనే యువతను బాగా ఆకర్షించి ఫాన్స్ గా మార్చుకుంటున్నారు. చిన్న సినిమాలను పక్కన పెట్టి పెద్ద సినిమాలలో కూడా ఓకే చెప్తున్నారు. ఈ లిస్టులో మొదటగా వచ్చేది సాయి పల్లవి. ఈ బ్యూటీ పక్కన ఎవరూ నటించిన కూడా హీరో కి డామినేషన్ గా అనిపిస్తుంది. తమిళ్, మలయాళం తెలుగు భాషలలో కలిసి సాయిపల్లవి నటించిన సినిమాలు ఏడు మాత్రమే.
తక్కువ సినిమాల్లో నటించిన సాయి పల్లవి క్రేజ్ స్టార్ హీరోలతో సమానంగా ఉంది. సాయిపల్లవి ఇంత పాపులర్ కావడానికి ముఖ్యకారణం ఆమె ఎంచుకున్న సబ్జెక్ట్ అందులో తాను ఎంచుకుంటున్న పాత్ర ప్రాధాన్యత. అందుకే మొదటి సినిమాతోనే లెక్క పెట్టుకోలేని అవార్డులను సొంతం చేసుకుంది. మలర్ పాత్ర తెచ్చిన సౌత్ ఇండియన్ లో ఒక సెన్సేషన్ హీరోయిన్ గా మారింది. ఇక ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, మూడు సైమా అవార్డ్ సొంతం చేసుకున్న సాయిపల్లవి… తెలుగు ఇండస్ట్రీలో ఫిదా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే సాయి పల్లవి నటించిన కణం సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల అయ్యాయి. ఆ తర్వాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలతో వచ్చే క్రేజ్ తో పాటు వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తలలో నిలిచే లాగా చేస్తుంది.
ఎంసీఏ సినిమా విషయంలో నానితో, కణం సినిమా విషయంలో నాగశౌర్య తో ఈ బ్యూటీకి విభేదాలు తలెత్తాయి అన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే… 2017 లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మలర్ పాత్ర ఆమె మొదటి సినిమా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆమె పదమూడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించింది. ప్రసన్న హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన కస్తూరి మాన్ అనే తమిళ సినిమాలో ఆర్టిస్ట్ గా నటించింది. అనంతరం 2017 లో కంగనా రనౌత్ మరియు జయం రవి హీరోహీరోయిన్లుగా నటించిన కస్తూరి మాన్ అనే సినిమాలో కూడా కంగనా స్నేహితురాలి పాత్రలో నటించింది. అప్పుడు సాయి పల్లవి వయస్సు 16 సంవత్సరాలు. ఆ తరువాత 2017 లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో పూర్తి సాయి కథానాయక పాత్రలు సాయి పల్లవి నటించింది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…