బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు అయన మాజీ మేనేజర్ దిశా ల మరణంపై నేటికీ అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. గత నెల 8 వ తారీఖున ముంబై లోని తన అపార్ట్మెంట్ 14 వ అంతస్తు నుంచి దూకి బలవాన్మరణానికి పాల్పడింది దిశ. అయితే అప్పటి నుంచి నేటి వరకు అనే వదంతులు, ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలపై దిశ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇకపై అటువంటి వార్తలను నిలిపివేయాలని ఆమె కుటుంబం కోరుతున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు దిశ కుటుంబ సభ్యులు.
అసలే తమకుటుంబ సభ్యురాలి మృతితో తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామని, దానికి తోడు ఇటువంటి వార్తలను చూసి మరింత బాధ పడుతున్నామని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దిశా మరణం తమకు తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చిందని, ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న తమకు ఈ వార్తలు మరింతగా కృంగదీస్తున్నాయని ఆ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా దిశా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, దయచేసి ఇటువంటి ఊహాగానాలకు, ఫేక్ వార్తలకు ఇంతటితో ఆపివేయాలని తమ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…