Categories: FeaturedMovie News

జబర్దస్త్ షో లో కరోనా కలకలం… హైపర్ ఆది టీమ్ మెంబర్ కి కరోనా పాజిటివ్… క్వారంటైన్ లో జబర్దస్ట్ టీం!!

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుపోతుంది. అంతేకాదు ఎవ్వరిని వదలటం లేదు ఈ మహమ్మారి. రాజకీయ నాయకుల నుంచి సినీ టీవీ రంగ ప్రముఖుల వరకు అందరిమీద కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర స్టార్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీరియల్స్ షూటింగ్స్ కూడా రద్దు చేసుకున్నారు.

ఈ మధ్యే ప్రభుత్వం సినిమా మరియు టీవీ షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో పలు షోలు, సీరియల్స్, సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. జబర్దస్త్ షో కూడా అలానే స్టార్ట్ చేసారు. అయితే తాజగా జబర్దస్త్ టీమ్ లో కూడా కరోనా కలకలం రేగుతోంది. కరోనా విషయంలో ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తున్నా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. తాజాగా హైపర్‌ ఆది టీంలో ఒక సభ్యునికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు పలు వార్తలు వచ్చాయి.

తాజాగా మొన్న జరిగిన ఎపిసోడ్ తరువాత అతనికి ఆరోగ్యం సరిగా లేదని టెస్టు చేయించడానికి వెళితే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సమాచారం. దీంతో అతనికి కలిసి పనిచేసిన హైపర్ ఆది టీం మెంబర్స్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హైపర్ ఆదితో పాటు మిగిలిన సభ్యులు కూడా కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారట. అయితే ఇప్పటికే నాలుగు వారాల ఎపిసోడ్స్ షూటింగ్స్ చేసి పెట్టుకున్నట్టు సమాచారం. ఏది ఏమయినా కరోనాతో జబర్దస్త్ షో కు మరో పెద్ద గండమే వచ్చినట్టుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago