కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుపోతుంది. అంతేకాదు ఎవ్వరిని వదలటం లేదు ఈ మహమ్మారి. రాజకీయ నాయకుల నుంచి సినీ టీవీ రంగ ప్రముఖుల వరకు అందరిమీద కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర స్టార్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీరియల్స్ షూటింగ్స్ కూడా రద్దు చేసుకున్నారు.

ఈ మధ్యే ప్రభుత్వం సినిమా మరియు టీవీ షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో పలు షోలు, సీరియల్స్, సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. జబర్దస్త్ షో కూడా అలానే స్టార్ట్ చేసారు. అయితే తాజగా జబర్దస్త్ టీమ్ లో కూడా కరోనా కలకలం రేగుతోంది. కరోనా విషయంలో ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తున్నా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. తాజాగా హైపర్ ఆది టీంలో ఒక సభ్యునికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు పలు వార్తలు వచ్చాయి.

తాజాగా మొన్న జరిగిన ఎపిసోడ్ తరువాత అతనికి ఆరోగ్యం సరిగా లేదని టెస్టు చేయించడానికి వెళితే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సమాచారం. దీంతో అతనికి కలిసి పనిచేసిన హైపర్ ఆది టీం మెంబర్స్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హైపర్ ఆదితో పాటు మిగిలిన సభ్యులు కూడా కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారట. అయితే ఇప్పటికే నాలుగు వారాల ఎపిసోడ్స్ షూటింగ్స్ చేసి పెట్టుకున్నట్టు సమాచారం. ఏది ఏమయినా కరోనాతో జబర్దస్త్ షో కు మరో పెద్ద గండమే వచ్చినట్టుంది.



























