RGV: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టు విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు ఏపీ రాజకీయాలలోనూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే .ఈయన గత ఏడాది వ్యూహం సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈ విషయంపై ఈయన పట్ల ఇప్పుడు కేసు నమోదు అయింది.
ఇక తనని అరెస్టు చేస్తారన్న భయంతోనే రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే పోలీసులు కూడా ఈయన ఇంటి బయట కాపలాగా ఉంటూ ఈయనని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై వర్మ లాయర్లు కూడా సీరియస్ అయ్యారు కొంత సమయం కావాలని పోలీసులకు మెసేజ్ పంపించినప్పటికీ ఇలా ఇంటి బయట పోలీసులు ఉండటం కరెక్ట్ కాదని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో వెళ్ళగా అక్కడ మీడియా సమావేశంలో ఈయనకు వర్మ అరెస్టు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలోను ఇతర విషయాలలో ఎంతో చురుకుగా వ్యవహరించిన పోలీసుల ప్రస్తుతం మాత్రం అంత యాక్టివ్ గా లేరని అనిపిస్తుంది. అందుకే వర్మ తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ పోలీసులు మాట్లాడటంతో పవన్ స్పందించారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా తన శాఖలకు సంబంధించిన పనులను తాను చూసుకుంటూ పోతున్నాను ఇక వర్మ అరెస్టు విషయం గురించి హోం శాఖ చూసుకుంటుంది.నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినా మీరు చెప్పిన ఈ విషయాలను తాను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…