Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఇక త్వరలోనే ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్ల గురించి ఎంతో ఉత్కంఠత నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాలకు కూడా అదనపు షోలతో పాటు సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పుష్ప సినిమాకి కూడా టికెట్ల రేట్లను పెంచుతారా లేకపోతే మామూలు ధరకే విక్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. మరి అల్లు అర్జున్ సినిమా విషయంలో ఈయన స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
ఇక గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకుండా వైకాపా నాయకుడికి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంతో పుష్ప సినిమాని కూడా ఇబ్బందులకు గురిచేస్తారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…